
ప్రస్తుతం ఎక్కడా చూసినా పొల్యూషన్ రాజ్యమేలుతోంది. పెరుగుతున్న వాహనాలు, జనసాంద్రత, ఫ్యాక్టరీల కారణంగా, చెత్తను తగులబెట్టడం వంటి కారణాలతో పట్టణాలు నగరాల్లో పొల్యూషన్ తారాస్థాయికి చేరుతుంది.

అయితే పొల్యూషన్ వల్ల పట్టణ, నగర వాసులకు కళ్లు ఎర్రబడడం, దురద రావడం సర్వసాధారణం. అధిక పొల్యూషన్ కారణంగా కళ్లు పొడిగా మారడం, లేదా నీరు కారడం, వంటి లక్షణాలను మనం గమనిస్తుంటాం. కానీ ఇవే సమస్యలు ధీర్ఘకాలంలో కంటి చూపునకు నష్టం కలిగిస్తాయి.

పొల్యూషన్ నుంచి కంటి చూపు రక్షణకు మార్గాలు

అధికంగా పొల్యూషన్ ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవడమే బెటరని కంటి వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే తప్పనిసరై బయటకు వెళ్తే కంటి రక్షణకు తగిన చర్యలను తీసుకోవాలని సూచిస్తున్నారు. తప్పనిసరిగా బయటకు వెళ్లినప్పడు కళ్లు మొత్తం కవరయ్యేలా కళ్లజోడు తప్పనిసరిగా ధరించాలి.

కళ్లు ఎర్రబడకుండా ఉండడానికి తరచూ వాటిని శుభ్రంగా ఉంచుకోవడంతో తేమగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీని వల్ల కళ్లు ఇరిటేషన్‌కు గురికావు..

అలాగే కళ్లు ఎర్రబడుతున్నట్లు అనిపిస్తే వాటిని కంటి అరకు సాయంతో శుభ్రపరుచుకుని కళ్లను ఎక్కువ రుద్దకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎక్కువగా నీరు తాగితే కళ్లు పొడిబారకుడా ఉండి ఇరిటేషన్ కు గురికావు. అలాగే కంటి రక్షణకు విటమిన్లు మినరల్స్ తో కూడిన సరైన పోషకాహారం తీసుకోవడం తప్పని సరి.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కళ్లు ఎర్రబడుతూనే కంటి డాక్టర్ దగ్గరకు వెళ్లి వైద్య సాయం పొందాలి.