Heeraben Modi Funeral: మోదీ తల్లి హీరాబెన్ ఆఖరి మజిలీ.. చివరిసారిగా తల్లిని ముద్ధాడిన మోడీ..ఫొటోస్.

|

Dec 30, 2022 | 4:19 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్‌ మోదీ అనారోగ్యం కారణంగా ఈ తెల్లవారుజామున మృతి చెందగా.. ఆమె అంత్యక్రియలు గాంధీనగర్ శ్మశానవాటికలో ముగిసాయి.

1 / 12
ఓ వైపు గుండెల నిండా దుఃఖం..మరోవైపు విధి నిర్వహణ..ఎస్‌..తల్లిని కోల్పోయిన బాధ ఉన్నప్పటికీ..తన విధులను మరవలేదు ప్రధాని మోదీ. దుఃఖాన్ని దిగమింగుకొని బెంగాల్‌లో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు.

2 / 12
తల్లి మృతితో ఇవాళ బెంగాల్‌ పర్యటనను రద్దు చేసుకున్న ప్రధాని..వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హౌరా-న్యూ జల్‌పయ్‌గురిని కలిపే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు.

3 / 12
అనంతరం తాను వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయానని..ఇందుకు బెంగాల్‌ ప్రజలు తనను క్షమించాలని కోరారు.

4 / 12
దీనిపై స్పందించిన బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ..మాతృమూర్తి మరణం తీరని లోటు..ఆ బాధ నుంచి బయటపడేలా మీకు ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను..మోదీజీ కాస్త రెస్ట్‌ తీసుకోండంటూ విచారం వ్యక్తం చేశారు.

5 / 12
ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచిన హీరాబెన్‌కు..స్వస్థలం గుజరాత్‌ గాంధీనగర్‌లో  అంత్యక్రియలు నిర్వహించారు. గాంధీనగర్‌ సెక్టార్‌ 30లోని స్మశానవాటికలో..తన సోదరులతో కలిసి..తల్లికి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు ప్రధాని మోదీ.

6 / 12
తల్లి పార్థివదేహానికి కన్నీటి నివాళులర్పించిన అనంతరం..స్వయంగా తల్లి పాడె మోశారు..అంతిమయాత్ర వాహనంలో తల్లి భౌతికకాయం పక్కనే కూర్చొని భావోద్వేగానికి గురయ్యారు.

7 / 12
తల్లి హీరాబెన్‌ మృతిపై భావోద్వేగ ట్వీట్‌ చేశారు ప్రధాని మోదీ. మహిమాన్వితమైన ఈశ్వరుడి పాదాల చెంత మా తల్లిగారు విశ్రాంతి తీసుకుంటున్నారు..

8 / 12
అమ్మను చూసినప్పడుల్లా త్రిమూర్తులను చూసిన అనుభూతి పొందేవాడిని అంటూ ట్వీట్‌ చేశారు.ఈ ఏడాది జూన్‌ 18న వందేళ్లు పూర్తి చేసుకున్నారు.

9 / 12
వందేళ్ల వయస్సు ఉన్నప్పటికీ నిన్నమొన్నటి వరకూ ఆమె చాలా యాక్టివ్‌గా ఉండేవారు. కొద్దిరోజుల క్రితం నుంచీ మాత్రం ఆరోగ్యం క్షీణించింది. అహ్మదాబాద్‌ మెహతా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.

10 / 12
కుమారులు, ముఖ్యమైన కుటుంబసభ్యులు సందర్శన అనంతరం అంత్యక్రియల కోసం వాహనంలో గాంధీనగర్‌ సెక్టార్ 30లోని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు.

11 / 12
ఈ క్రమంలో తల్లి పాడెను స్వయంగా ప్రధాని మోదీ మోసారు. ఆ తర్వాత వాహనంలో పార్థివదేహంతో పాటు ప్రధాని మోదీ శ్మశానవాటికకు చేరుకున్నారు.

12 / 12
ఎటువంటి హడావుడి లేకుండా సాధారణంగా అంతిమయాత్ర నిర్వహించారు.