టీడీపీ నేత చంద్రబాబు నాయుడు అరెస్టు విషయం తెలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుండి విజయవాడ విమానంలో వెళ్లేందుకు అనుమతించకపోవడంతో పవన్ కల్యాణ్ రోడ్డు మార్గం కార్ లో విజయవాడకు బయలు దేరారు..
ఆంధ్ర బోర్డర్ లో గరికపాడు చెక్‌పోస్ట్ దగ్గర పవన్‌ని పోలీసులు అడ్డుకున్నరు. పవన్ ను అడ్డుకోవడంతో హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యిన విషయం తెలిసిందే..
గరికపాడులో పవన్ కల్యాణ్‌కు నాదెండ్ల మనోహర్ అభిమానులతో కలిసి స్వాగతం పలికారు.. ఏపీ – తెలంగాణ సరిహద్దులో పెద్ద ఎత్తున హై టెన్షన్ నెలకొంది. అక్కడి నుండి పవన్ కళ్యాణ్ అనుమంచిపల్లిలో మరోసారి పవన్ కాన్వాయ్ ను అడ్డుకున్నరు పోలీసులు..
ఎన్టీఆర్ జిల్లా అనుమంచిపల్లిలో పోలీసులు అడ్డుకోవడంతో నడచి మంగళగిరి చేరుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం.
అనుమంచిపల్లిలో వాహనం దిగి నడక మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు మీద పడుకుని నిరసన తెలియజేసారు జనసేనాని
ఇదే తరుణంలో పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లిన సిపి క్రాంతి రానా టాటా. సిపి వచ్చేవరకు కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా అడ్డుకునే యత్నం చేసిన పోలీస్ అధికారులు.
దీనిపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. నారా లోకేష్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఖండించారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ కారణం లేకుండా, పోలీసులే అల్లరి మూకల మాదిరిగా రోడ్డుకి అడ్డంపడి పవన్ కళ్యాణ్ గారిని కదలనివ్వకుండా చేయడం దారుణం. రాజకీయ నేతలని అక్రమంగా నిర్బంధించడం రాజ్యాంగ విరుద్ధం. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. ఎమర్జెన్సీ కంటే ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు..:నారా లోకేష్
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా లండన్ పర్యటనలో సీఎం జగన్ బస చేసిన ప్రాంతంలో "మంచోడు జైల్లో.. పిచ్చోడు లండన్లో" అంటూ ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తల ఆందోళన చేపట్టిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.