3 / 4
అటు ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు మంత్రుల కమిటీ ప్రయత్నిస్తున్నా, ఎవరూ రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల పాటు మంత్రుల కమిటీ సమావేశమైనా ఉద్యోగ సంఘాల నేతలు రావడం లేదు. ఇకపై ఎదురు చూపులు ఉండవని, వాళ్లు వస్తేనే చర్చలని స్పష్టం చేసింది మంత్రుల కమిటీ. చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు మంత్రి బొత్స .