PM Jan Dhan Yojana: రెండేళ్లుగా యాక్టివ్‌గా లేని బ్యాంకు ఖాతాలు ఎన్ని..? ఇందులో జన్ ధన్ అకౌంట్స్‌ కూడా..

|

Aug 29, 2023 | 8:58 PM

భారతదేశంలో జన్ ధన్ ఖాతాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జన్ ధన్ యోజన కింద ఏడాదిలో 3 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరవబడుతున్నాయి. అలాగే జన్ ధన్ ఖాతాలో జమ అయిన మొత్తం రూ.2 లక్షల కోట్ల మార్కును దాటిందని సమాచారం. అలాగే 2015 మార్చి నెలలో జన్ ధన్ ఖాతాల్లో సగటు డబ్బు రూ.1,065. ఎనిమిదేళ్ల తర్వాత, ఆగస్టు 2023లో సగటు బ్యాలెన్స్ రూ.4,063గా ఉన్నట్లు ..

1 / 5
కేంద్ర ప్రభుత్వం 2014లో ప్రారంభించిన ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజనలో పెద్ద సంఖ్యలో ఖాతాలు నిష్క్రియంగా ఉన్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద ప్రారంభించబడిన బ్యాంకు ఖాతాలలో 18 నుంచి 20 శాతం ఖాతాలు నిష్క్రియ స్థితిలో ఉన్నాయి. అంటే రెండేళ్ల నుంచి ఈ ఖాతాల ద్వారా ఎలాంటి లావాదేవీలు జరగలేదు. మొత్తం మీద 50 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు ఉన్నాయని, అందులో దాదాపు 10 కోట్ల ఖాతాలు పనిచేయనివని చెప్పారు. అయితే జన్‌ ధన్‌ యోజనను అమలు చేసి 9 ఏళ్లు పూర్తవుతోంది.

2 / 5
ఇది నిజంగా పెద్ద సంఖ్యే అయినప్పటికీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. దానికి కారణం ఉంది. జన్ ధన్ ఖాతాలే కాకుండా ఇతర బ్యాంకు ఖాతాల్లో కూడా ఇన్ యాక్టివ్ ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. జన్ ధన్ ఖాతాతో సహా భారతదేశంలో మొత్తం 225 కోట్ల బ్యాంకు ఖాతాలు ఉన్నాయి.

3 / 5
ఇందులో దాదాపు 44 నుంచి 46 కోట్ల ఖాతాలు నిష్క్రియ స్థితిలో ఉన్నాయి. జన్ ధన్ ఖాతాలే కాకుండా దాదాపు 35 కోట్ల సాధారణ ఖాతాలు కూడా నిష్క్రియంగా ఉన్నట్లు గుర్తించారు. అంటే, శాతం. 20% సాధారణ బ్యాంకు ఖాతాలు వాడుకలో లేకుండా ఉన్నాయి.

4 / 5
భారతదేశంలో జన్ ధన్ ఖాతాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జన్ ధన్ యోజన కింద ఏడాదిలో 3 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరవబడుతున్నాయి. అలాగే జన్ ధన్ ఖాతాలో జమ అయిన మొత్తం రూ.2 లక్షల కోట్ల మార్కును దాటిందని సమాచారం.

5 / 5
అలాగే 2015 మార్చి నెలలో జన్ ధన్ ఖాతాల్లో సగటు డబ్బు రూ.1,065. ఎనిమిదేళ్ల తర్వాత, ఆగస్టు 2023లో సగటు బ్యాలెన్స్ రూ.4,063గా ఉన్నట్లు సమాచారం. అయితే యాక్టివ్‌గా లేని ఖాతాలు యాక్టివ్‌గా చేసేందుకు బ్యాంకులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి.