
ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన జంక్ ఫుడ్స్‌లో పిజ్జా ఒకటి. పిజ్జాని చాలా మంది తరచూ తింటూ ఉంటారు. కానీ అది జంక్ ఫుడ్. టేస్టీకి చాలా మంచిది. కానీ ఆరోగ్యం కోసం కాదు. పిజ్జాతో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. పిజ్జా అతిగా తినడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తే మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు.

పిజ్జాలో సోడియం స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. మీరు ప్రతిరోజూ అలాంటి పిజ్జా తింటే, అది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. మీరు ఒకేసారి మొత్తం పిజ్జా తింటే, మీరు మీ రోజువారీ సోడియం తీసుకోవడం అధికంగా చేస్తున్నారని అర్థం. దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండె సమస్యలను కలిగిస్తుంది.

పిజ్జా తినడం వల్ల వచ్చే మరో ప్రమాదకరమైన వ్యాధి గుండెపోటు. మాంసాలతో తయారు చేసిన పిజ్జా తింటే, అది ఊబకాయం, కొన్ని క్యాన్సర్, గుండె సమస్యలను కలిగిస్తుంది. ఈ ప్రాసెస్ చేసిన మాంసాలను ఎక్కువగా తినడం గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

తరచుగా పిజ్జా తినడం వల్ల వచ్చే సమస్యలలో మధుమేహం ఒకటి. పిజ్జా తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగి క్రమంగా డయాబెటిస్‌గా మారుతుంది. పిజ్జా వంటి అధిక కొవ్వు ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం వల్ల కడుపు, పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దానికి తోడు బరువు విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో ఇతర సమస్యలు కూడా పెరుగుతున్నాయి.

పిజ్జాతో ముందుగా వచ్చే అతి పెద్ద సమస్య మలబద్ధకం..! పిజ్జా కోసం వాడే మైదా సరిగా జీర్ణం కాదు. ఒక స్లైస్ చీజ్ పిజ్జాలో 400 కెలరీలు ఉంటాయి. ఒక్క స్లైస్‌తో ఆపలేము కదా! ఫలితంగా.. వేగంగా బరువు పెరిగిపోతారు. రిఫైన్డ్ ఫ్లోర్‌తో తయారు చేయడంతో పిజ్జా చాలా హెవీగా ఉంటుంది. ఏ పని చేయలేకపోతాము. అయితే.. పిజ్జాని అప్పుడప్పుడు తినడంలో తప్పు లేదు. కానీ దానిని ఎక్కువగా తినడమే సమస్య! అప్పుడప్పుడు క్వాంటిటీ తగ్గించి తినండి. (ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)