
పొట్టేల్ తలకాయ కూర వండటానికి కావాల్సిన పదార్థాలు : తలకాయ నీటుగా శుభ్రం చేసి, పక్కన పెట్టుకోవాలి. ఇది అర కేజీ తీసుకోవాలి. తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర తరుగు, ఉప్పు తగినంత, కొబ్బరి తురుము, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు రుచికి సరిపడ, పచ్చి మిర్చి, ఉల్లిపాయ , మిరియాల పొడి వన టీ స్పూన్. లవంగాలు నాలుగు నుంచి, మూడు వరకు.

తయారీ విధానం : తలకాయ కూరను ఒక బౌల్‌లోకి తీసుకొని, అందులో కొన్ని వాటర్, నిమ్మరసం, పసుపు వేసి శుభ్రం చేసుకోవాలి. నీరు మొత్తం పోయిన తర్వాత, అందులో కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నూనె వేసి , మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి , అందులో కొంచెం నూనె వేసి నూనె కాలేలా చూసుకోవాలి. తర్వాత అందులో నాలుగు లవంగాలు, ఆనియన్స్, పచ్చి మిర్చి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లులి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.

తర్వాత అందులో మనం కలిపి పక్కన పెట్టుకున్న పొట్టేల్ తలకాయ కూరను వేసుకొని మంచిగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్ మంటపై దాదాపు పావు గంట సేపు తలకాయ కర్రీనీ ఉడికించుకోవాలి. తర్వాత గ్లాస్ వాటర్ పోసి, మరో 10నిమిషాల పాటు ఉడికించుకోవాలి.

ఇది ఎంత ఉడికితే ఆరోగ్యానికి అంత మంచిది. ఇక ముక్క ఉడికిన తర్వాత అందులో వన్ టీ స్పూన్ కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కొబ్బరి తురుము వేసి మరో పదినిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. చివరగా కొత్తిమీర, పూదీన వేయాలి. అంతే టేస్టీ టేస్టీ పొట్టేల్ తలకాయ కర్రీ రెడీ.