
నిజానికి నెయ్యిలో ఎన్నో పోషకాలుంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా అందాన్ని కూడా పెంచుతాయి. గుండె, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు నెయ్యిని ఎక్కువగా వాడకూడదని చెబుతున్నారు. ఎందుకంటే నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయని చెబుతున్నారు.

జీర్ణ సమస్యలతో బాధపడేవారు కూడా నెయ్యిని తినకూడదని పోషకాహార నిపుణులు అంటున్నారు. గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతున్నవారు నెయ్యిని ఎక్కువగా తినకూడదని అంటున్నారు. ఎందుకంటే నెయ్యిని ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయని అంటున్నారు.

నెయ్యిలోని కొవ్వు ఆమ్లాలు రక్తపోటును పెంచుతాయి. అందుకే రక్తపోటు సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. అంతేకాదు..దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు ఉన్నప్పుడు మీరు నెయ్యిని తినకపోవడమే మంచిదని అంటున్నారు.

అధిక బరువు, బరువు తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నవారు నెయ్యిని ఎక్కువగా తింటే మరింత బరువు పెరిగిపోతారని నిపుణులు చెబుతున్నారు. అలాగే నెయ్యిలో కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా తింటే ఊబకాయం బారిన పడే అవకాశం కూడా ఉందంటున్నారు.

డయాబెటిస్ సమస్యలు ఉన్నవారు నెయ్యికి దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే... నెయ్యిలో ఉండే కొవ్వుల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉందంటున్నారు.