
పల్లీలు , పిస్తాపప్పులు రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి రెండూ ప్రోటీన్, ఫైబర్‌కు మంచి మూలం. అయితే కొంత మందిలో కొన్ని రకాల డౌట్స్ ఉటాయి. అసలు ఇందులో ఏది తినడం ఆరోగ్యానికి మంచిది అని, కాగా, ఇప్పుడు మనం దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

వేరుశనగలు, పిస్తాపప్పులు రెండూ కూడా ప్రోటీన్, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ ఇచ్చే సూపర్ ఫుడ్సే అయినప్పటికీ , ఈ రెండింటి లో చాలా తేడాలు ఉన్నాయంట. దాదాపు 28 గ్రాముల వేరుశనగలో 7.31 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కానీ పిస్తా పప్పుల్లో 5.73 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ఉంటుందంట. కానీ పిస్తాలో వేరుశనగ కంటే, శరీరానికి కావాల్సిన 9 రకాల ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.

పిస్తాపప్పుల్లో వేరుశనగల కంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. వేరుశనగల్లో 2.41 ఫైబర్ ఉంటే, పిస్తాపప్పుల్లో 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అయితే పిస్తాపప్పుల్లో ఫైబర్ అధికంగా ఉండటం వలన ఇది షుగర్ కంట్రోల్, కొలెస్ట్రాల్ తగ్గడం, జీర్ణక్రియ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందంట.

అయితే ఇందులో ఎవరు ఏది తినడం ఆరోగ్యానికి మంచిది అనే విషయానికి వెళ్తే.. ఎవరు అయితే బరువు తగ్గాలి అనుకుంటున్నారో వారు పిస్తా పప్పులు తినడం చాలా మంచిది. వీటిని తినడం వలన చాలా త్వరగా బరువు తగ్గే ఛాన్స్ ఉంది.అలాగే కండరాలకు అభివృద్ధికి, ప్రోటీన్ ఎక్కువగా ఉండే వేరుశనగలు చాలా మంచిది. వీటిని తినడం వలన కండరాలు బలంగా తయారు అవుతాయి.

అంతే కాకుండా కంటి ఆరోగ్యం కోసం పిస్తా తినడం చాలా మంచిది. పిస్తాపప్పుల్లో లూటిన్, జియాజాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువలన ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరిచి, కళ్లకు మేలు చేస్తాయి. ఇక గుండె ఆరోగ్యానికి కూడా ఈ రెండూ కూడా మేలు చేస్తాయి. ప్రతి రోజూ గుప్పెడు పిస్తా, వేరుశనగలు తీసుకోవడం వలన ఇవి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.