
కృష్ణ ఫలం అని పిలువబడే పాషన్ ఫ్రూట్.. పాసిఫ్లోరా తీగ నుండి ఉత్పత్తి అవుతుంది. ఇది బ్రెజిల్, పరాగ్వే, అర్జెంటీనాకు చెందినది. ఉష్ణమండల పండు అయినప్పటికీ, దాని రకాలు కొన్ని ఉపఉష్ణమండల వాతావరణంలో కూడా పండుతున్నాయి. అందుకే దీనిని ఇప్పుడు ఆసియా, యూరప్, ఉత్తర అమెరికాలోని అనేక దేశాలలో సాగు చేస్తున్నారు. ప్రజలకు పెద్దగా పరిచయం లేని ఈ పండు అద్భుతమైన ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం...

పాషన్ ఫ్రూట్‌లో విటమిన్లు ఎ, సి, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. పాషన్ ఫ్రూట్ ఆకులు కూడా పండ్ల మాదిరిగానే పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. వీటిలో విటమిన్ సి, ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి. ఈ ఆకులను కూరగా కూడా తినవచ్చు. ఇది శరీరానికి అవసరమైన విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది.

పాషన్ ఫ్రూట్ ఆకులను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని పలువురు పరిశోధకులు చెబుతున్నారు. ఈ ఆకులు శక్తిని అందించడమే కాకుండా, క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. పాషన్ ఫ్రూట్ ఆకు రసం గ్యాస్, అజీర్ణం, కడుపు సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. దీని సహజ లక్షణాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో, కడుపు సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.

ముఖ్యంగా పాషన్ ఫ్రూట్ ఆకులు మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ ఆకుల రసం లేదా కషాయాలను తయారు చేసి తినడం ద్వారా, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు అంటున్నారు. ఇది దీర్ఘకాలంలో మధుమేహం ప్రభావాలను తగ్గిస్తుంది. పాషన్ ఆకులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు శరీరంలో రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి.

డయాబెటిస్ రోగులు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సానుకూల ఫలితాలను చూడవచ్చు. పాషన్ ఫ్రూట్ ఆకులు కాలేయ సమస్యలతో బాధపడేవారికి కూడా ప్రయోజనకరంగా పనిచేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. పాషన్ ఫ్రూట్, దాని ఆకులు విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉండటం వలన శరీరానికి అవసరమైన పోషణను అందిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది.