Parijat Benefits: పారిజాతం ఆయుర్వేదవైద్యంలో అగ్రస్థానం.. పువ్వు, ఆకులు అనేక రకాల వ్యాధులకు దివ్య ఔషధం

Updated on: Nov 24, 2023 | 11:27 AM

పురాణాల్లో ప్రస్తావన ఉన్న వృక్షం పారిజాతం. ఈ వృక్షానికి ఉన్న వివిధ వైద్యప్రయోజనాల దృష్ట్యా ఆయుర్వేదం ఈ పూలమొక్కకు అగ్రస్థానాన్నే ఇచ్చింది. ఆయుర్వేద వైద్యం, జానపద ఔషధాలు పారిజాతాన్ని అత్యంత యాంటీమైక్రోబయాల్ గా గుర్తించాయి. రెండు వేర్వేరు అధ్యయనాలలో పారిజాతాన్ని అతి ఉత్తమంగా ఏ దిశలో ఎలా ఉపయోగించాలి అన్న విషయంపై పరిశోధకులు పరిశోధన జరిపాయి.

1 / 10
అనేక రకాల జ్వరాలకు పారిజాత పువ్వు, ఆకులు దివ్య ఔషధాలు. మలేరియా లక్షణాల చికిత్సలో పారిజాత ఆకులు చాలా ప్రయోజనకరంగా ఉన్నాయని అధ్యయనాలు కనుగొన్నాయి. పారిజాత ఆకులు మలేరియా జ్వరం నుండి ఉపశమనం కలిగిస్తాయి. పారిజాతం స్త్రీలలో వచ్చే నెలసరి సమయంలో తిమ్మిరి నుండి ఉపశమనానికి సహాయపడుతుంది. దంత సమస్యలు, హైపర్ అసిడిటీ, వికారం మొదలైన జీర్ణ సమస్యలను నివారిస్తుంది.

2 / 10
పారిజాతం చెట్టు రాత్రిపూట మాత్రమే పువ్వులు పూసి, ఉదయం పూట తాను పూసిన పూలన్నింటినీ రాల్చివేస్తుంది. అందుకనే దీనిని “రాత్ కీ రాణి” గా పిలుస్తారు. ఈ రోజు పారిజాతం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.. 

3 / 10
పారిజాత అనేది ఆయుర్వేదంలో ఒక అద్భుత మొక్క, ముఖ్యంగా అపారమైన ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి.  దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికం. ఔషధ మొక్క నొప్పిని తగ్గించడం నుండి జ్వరాన్ని తగ్గించడం వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. 

4 / 10
పారిజాత గొప్ప జ్వర నివారిణిగా ప్రసిద్ధి చెందింది. ఇది మలేరియా, డెంగ్యూ , చికున్‌గున్యా జ్వరంతో సహా వివిధ జ్వరాలను నయం చేస్తుంది.

5 / 10
ఆర్థరైటిస్, సయాటికా వంటి సమస్యలకు పారిజాత ఆకులు, పువ్వులు శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. ఆర్థరైటిస్, మోకాళ్ల నొప్పుల చికిత్సలో పారిజాత నూనెను ఉపయోగిస్తారు.

6 / 10

నిరంతరం దగ్గు, గొంతు చికాకుతో బాధపడేవారికి పారిజాత ఆకులు, పువ్వులతో తయారు చేసిన టీ దగ్గు, జలుబు, బ్రోన్కైటిస్ నుండి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తారు.

7 / 10
యాంటీ అలర్జీ, యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటే పారిజాత నూనెను ఉపయోగించవచ్చు. అంతేకాదు చర్మం మీద వివిధ ఫంగల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.

8 / 10
పారిజాతం డెంగ్యూ, చికున్‌గున్యా జ్వరాలలో ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడంలో సహాయపడుతుంది. ఇది జ్వరాన్ని కలిగించే బ్యాక్టీరియా వృద్ధిని నిరోధిస్తుంది.

9 / 10
పారిజాత పువ్వులు, ఆకులు ఇథనాల్ ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇమ్యునోస్టిమ్యులేటరీగా పనిచేస్తాయి.

10 / 10
పారిజాత పువ్వులు హెయిర్ టానిక్‌గా పనిచేస్తాయి. జుట్టును బలోపేతం చేయడానికి, జుట్టు రాలడాన్ని నివారించడానికి ఉపయోగిస్తారు. పారిజాతం జుట్టు నెరసిపోవడాన్ని, ఇతర స్కాల్ప్ సంబంధిత సమస్యలను నివారిస్తుంది.