దంచి కొట్టే వానల్లో పచ్చి కారం బువ్వ తింటే జలుబు, దగ్గు పరార్.. 5 నిముషాల్లోనే రెడీ

Updated on: Jun 26, 2026 | 8:12 AM

వానా కాలం మొదలైంది అలాంటి సమయాల్లో ఏదోకటి కారంగా తినాలనిస్తే ఈ పచ్చడి మంచిది. మీరు దీనిని ఒకసారి తింటే అసలు వదిలిపెట్టరు అంత రుచిగా ఉంటుంది. మరి, లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

1 / 5
పచ్చి కారం పచ్చడికి కావలసిన పదార్థాలు: పచ్చి మిర్చి 10, మూడు వెల్లుల్లి రెబ్బలు, చిన్న నిమ్మకాయంత చింతపండు, 
రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు,  ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు , అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకులు, రెండు ఎండుమిర్చిని తీసుకోవాలి.

పచ్చి కారం పచ్చడికి కావలసిన పదార్థాలు: పచ్చి మిర్చి 10, మూడు వెల్లుల్లి రెబ్బలు, చిన్న నిమ్మకాయంత చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు , అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకులు, రెండు ఎండుమిర్చిని తీసుకోవాలి.

2 / 5
పచ్చి కారం పచ్చడి తయారీ విధానం: ముందు పచ్చి మిర్చిని తీసుకుని , వాటిని బాగా కడిగి ఒక పొడి క్లాత్ తో తుడిచి వాటిని ముక్కలుగా కోయాలి. మీరు ఎక్కువగా కారం తినాలి అనుకుంటే  ఆ టేస్ట్ కు తగ్గట్టు దానిని తీసుకుంటే సరిపోతోంది. అలాగే, చింతపండును కూడా  నానబెట్టాలి మీరు దీనిని నీళ్లలో కనీసం 10 నిమిషాలు పాటు నానబెట్టాలి.

3 / 5
పచ్చి కారం పచ్చడి తయారీ విధానం స్టెప్ 1 : పాన్‌లో ఆయిల్ వేసి, అది బాగా వేడయ్యాక పచ్చి మిర్చి ముక్కలు కూడా వేసి మీడియం మంటపై 10 నిమిషాలు పాటు వేయించి. ఇవి కొద్దిగా మెత్తబడే వరకు పొయ్యి మీద ఉంచితే టేస్ట్ అదిరిపోతోంది.  ఇప్పుడు ఇంకో పాన్ తీసుకుని జీలకర్ర కూడా వేసి 5 నిమిషాలు పాటు బాగా వేయించాలి.

4 / 5

పచ్చి కారం పచ్చడి తయారీ విధానం స్టెప్ 2 : ఇక ఇప్పుడు వేయించి  పచ్చి మిర్చిని తీసుకుని ఇంకా జీలకర్రను కూడా తీసుకుని  చల్లారనివ్వాలి. దీనిని  మిక్సీ జార్‌లో వేసి మిక్సీ పట్టుకోవాలి. అయితే, మధ్యలో వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, ఇంకా ఉప్పు కూడా దీనిలో  వేసుకోవాలి. కొద్దిగా కచ్చా పచ్చాగా దంచితే చాలు. అలా ఉండేలా దీనిని గ్రైండ్ చేయాలి.

5 / 5
 బాగా ముద్దలా కావాలంటే దీనిని అలాగే  తిప్పుకోవచ్చు. ఇంకా చిన్న పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు ఎండుమిర్చి, నాలుగు కరివేపాకులు కూడా వేసి దీనిని తాలింపు పెట్టాలి. ఆ తరువాత దీనిని  పచ్చడి మీద పోసి పోపు పోయాలి. అంతే ఈ వేడి వేడి పచ్చి కారం పచ్చడి రెడీ.

Follow Us