డైటింగ్, జిమ్‌కి వెళ్లకుండానే ఈజీగా బరువు తగ్గొచ్చు.. ఎలాగో తెలుసుకోండి..

|

Aug 12, 2024 | 3:08 PM

చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కారణంగా చాలామంది ఊబకాయం బారిన పడుతున్నారు. ఒకే చోట ఎక్కువ గంటలు పనిచేయడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా ఊబకాయం (స్థూలకాయం) వస్తుంది. వాస్తవానికి ఊబకాయం అన్ని వ్యాధులకు, సమస్యలకు ప్రధాన కారణంగా పేర్కొంటారు..

1 / 5
చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కారణంగా చాలామంది ఊబకాయం బారిన పడుతున్నారు. ఒకే చోట ఎక్కువ గంటలు పనిచేయడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా ఊబకాయం (స్థూలకాయం) వస్తుంది. వాస్తవానికి ఊబకాయం అన్ని వ్యాధులకు, సమస్యలకు ప్రధాన కారణంగా పేర్కొంటారు.. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం మిమ్మల్ని ఫిట్‌గా ఉంచడానికి సిఫార్సు చేస్తారు.. కానీ, సమయం లేకపోవడం, బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది వ్యాయామం, డైట్ చేయాలనుకున్నా చేయలేరు. వాస్తవానికి ఒకేసారి బరువు తగ్గడం అనేది కష్టం.. వ్యాయామం, డైటింగ్ లేకుండా ఫిట్‌గా ఉండాలనుకునే వారు చాలామంది ఉన్నారు.. అలాంటప్పుడు ప్రతిరోజూ ఈ చిన్న చిన్న పనులు చేస్తే మీ ఫిట్‌నెస్ పెరుగుతుందని డైటీషియన్లు పేర్కొంటున్నారు. అవేంటో తెలుసుకోండి..

2 / 5
ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయండి: ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయండి. మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవడానికి ఇది సులభమైన మార్గం. కొన్ని అధ్యయనాల ప్రకారం, ప్రతిరోజూ 30 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల మీరు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండగలుగుతారు. ముఖ్యంగా తిన్న తర్వాత నడవడం అలవాటు చేసుకోండి.

3 / 5
సరిపడా నీళ్లు తాగండి: శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి తగినంత నీరు త్రాగాలి. డీహైడ్రేషన్ మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవడానికి రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలి.

4 / 5
సమయానికి తినడం: బరువు తగ్గడానికి మీ ఆహారాన్ని .. తినే సమయంలో మార్పులు చేసుకోండి.. అల్పాహారం, లంచ్, డిన్నర్ సమయానికి తినండి.. ముఖ్యంగా రాత్రి పూట తొందరగా తినడం అలవాటు చేసుకోండి. రాత్రి భోజనం తొందరగా తింటే అది జీర్ణమై బరువు పెరగదు.

5 / 5
ఇంట్లో తయారు చేసుకుని తినండి: బరువు తగ్గడానికి అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఫాస్ట్ ఫుడ్ తినడం.. బయట ఆహార పదార్థాలు తినడం.. అందుకే ఇంట్లో వండిన భోజనం తినండి. ఇంట్లో తయారుచేసిన ఆహారం శుభ్రమైనది.. పోషకమైనది. ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు మీ బరువును నియంత్రించుకోవచ్చు.