Hyderabad IT Employees - Health: ఐటీ ఉద్యోగం.. రూ.లక్షల్లో సంపాదన.. ఫుల్ టు బిందాస్.. లైఫ్‌లో ఎలాంటి ఢోకా ఉండదు.. ఇంకెముంది బాస్.. నెక్స్ట్ ఏంటి..? అంటూ చాలా మంది ఐటీ ఉద్యోగులను పలకరిస్తుంటారు.. కానీ.. ఇది వినడానికి వినసొంపుగా ఉన్నా.. ఆరోగ్యం మాత్రం దినదినగండమని.. ప్రమాదకర వ్యాధులు మూటగట్టుకోవాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు.. హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు ప్రమాదకర సమస్యలు చుట్టుముడుతున్నాయని, ఇది ప్రాణాలకే ప్రమాదమని అధ్యయనం పేర్కొంది. హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ మంది తమ జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, పని ప్రదేశాల్లో తీవ్ర ఒత్తిడి కారణంగా గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, స్ట్రోక్స్, ఇతర రకాల నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్‌సిడిలు) బారిన పడే ప్రమాదం ఉందని.. హైదరాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది.