NTR భరోసా పింఛన్ల తేదీ మారింది.. ఈ 6 జిల్లాల్లో రేపే అకౌంట్లలోకి డబ్బులు..

Updated on: Jul 29, 2026 | 8:32 PM

భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. ప్రధాని పర్యటన కారణంగా ఆరు జిల్లాల్లో జులై 30న పింఛన్లు పంపిణీ చేయనున్నారు. పింఛన్ల పంపిణీకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలు ఎంపికయ్యాయి.

1 / 5

2 / 5
 పింఛన్ల కోసం జులై 29న గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆరు జిల్లాల్లో పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం మొత్తం 514.42 కోట్ల రూపాయలను విడుదల చేసింది.

3 / 5
ప్రతి నెల మొదటి తేదీన ఇస్తారు  ఇది చాలామందికి కేవలం క్యాలెండర్‌లోని ఒక రోజు మాత్రమే. కానీ, ఈ సారి కొన్ని జిల్లాల్లో ముందుగానే ఇస్తున్నారు. అందరూ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ NTR భరోసా పింఛన్ల పంపిణీ తేదీ మారింది

4 / 5
ప్రధాని మోదీ భోగాపురం పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఆగస్ట్ 1న ఉ.10 గంటల 45 నిమిషాలకు ప్రధాని మోదీ భోగాపురం చేరుకుంటారు. ప్రధానికి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు స్వాగతం పలుకుతారు.

5 / 5
 అనంతరం కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. అక్కడే శిలాఫలకం ఆవిష్కరించి అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుడతారు. ఆ తరువాత జరగబోయే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంట 5 నిమిషాలకు భోగాపురం నుంచి ప్రధాని ఢిల్లీ బయలుదేరి వెళతారు.

Loading...
Unable to load recommendations.
Follow Us