Noni Fruit: ఈ ఒక్క పండు తింటే చాలు..100 రకాల వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!

|

Nov 27, 2023 | 8:18 PM

ప్రకృతిలో లభించే అనేక రకాలైన పండ్లు, కాయలు ఎన్నో రోగాలను నయం చేస్తాయి.. అందులో నోని పండు కూడా ఒకటి. దీనినే తొగరు పండు అని కూడా అంటారు. బంగాళాదుంప ఆకారంలో పసుపు, లేత ఆకుపచ్చ రంగులో కనిపించే ఈ పండు చూస్తే గుర్తు పడతారు.. కానీ, ఈ పండు గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. కానీ, ఈ పండు ఆరోగ్యానికి ఔషధ గని వంటిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు..నోని పండు ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 6
ఈ పండులో విటమిన్ సి, బి3, ఎ, ఐరన్, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి.  దీని ఆకులు, బెరడు, వేర్లు కూడా పలు రకాల మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ నోని పండ్లతో తయారు చేసిన జ్యూస్ రోజు తాగడం ద్వారా మన రోగ నిరోధక శక్తి బలంగా మారుతుంది.

2 / 6
నోని పండు రక్తంలో చక్కెరను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. దీని ఆకులు కూడా మధుమేహానికి మేలు చేస్తాయి. ఈ పండ్లు లేదా జ్యూస్ తాగితే షుగర్ వ్యాధిని కంట్రోల్ అవుతుంది.

3 / 6
ఈ పండులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.  దీని వినియోగం ఎముకల రాపిడిని తగ్గించడం ద్వారా కీళ్ల నొప్పుల సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

4 / 6
ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్ సి ఉన్నాయి. కాబట్టి ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. చర్మ సమస్యలను కూడా తొలగిస్తుంది.

5 / 6
కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఈ పండు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది.

6 / 6
జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. నోని పండ్ల ఆకులలో ఉండే ఔషధ గుణాలు వాపు, ఎరుపు, దురద వంటి చర్మ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.