
ఈ సంవత్సరం ఈ పువ్వు వికసిస్తే.. దాన్ని మళ్లీ చూడాలంటే మనం 2034 వరకు వేచి ఉండాల్సిందే. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది భారతదేశంలో మాత్రమే పెరుగుతుంది.

నీలకురింజి పూలను కేరళలోని ఇడుక్కి జిల్లాలో పండిస్తారు. నీలకురింజి మామూలు పువ్వు కాదు. చాలా అరుదైన పుష్పం. ఈ పూలను చూడాలంటే 12 ఏళ్లు ఆగాల్సి ఉంటుంది. నీలకురింజి ఒక మోనోకార్పిక్ మొక్క. ఇది వికసించిన వెంటనే వాడిపోతుంది.

ఒకసారి పువ్వు ఎండిపోయిన తర్వాత మళ్లీ పూయడానికి 12 ఏళ్లు పడుతుంది. సాధారణంగా నీలకురింజి ఆగస్టు నుండి అక్టోబర్ వరకు మాత్రమే పూస్తుంది. ఈ సంవత్సరం వికసించిన తరువాత, మళ్లీ 2033 సంవత్సరంలో కనిపిస్తుంది. గతేడాది అక్టోబర్‌లో ఈ పూలు ఎక్కువగా కనిపించాయి.

నీలకురింజిలోని మరో విశేషమేమిటంటే ఇది భారతదేశంలోనే పూస్తుంది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని మరే దేశంలోనూ ఇవి పూయవు. నీలకురింజి ప్రధానంగా కేరళలో వికసిస్తుంది. కేరళతో పాటు అరుదుగా తమిళనాడులో కూడా ఈ పూల అందాలు కనిపిస్తాయి.

నీలకురింజిని చూసేందుకు కేరళకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. కేవలం నీలకురింజిని చూసేందుకు లక్షల రూపాయలు వెచ్చించి ప్రపంచం నలుమూలల నుండి అనేక మంది పర్యాటకులు కేరళకు రావడం విశేషం.