
దాదాపు ప్రతి ఇంట్లో బొద్దింకలు ఒక పెద్ద సమస్య. కొంత మందికి బొద్దింకలను చూస్తేనే చచ్చేంత భయం. ముఖ్యంగా వంటగదిలో బొద్దింకలు పెద్ద సంఖ్యలో కనిపిస్తుంటాయి. విశేషం ఏమిటంటే ఇంట్లో ఒక్క బొద్దింక కనిస్తే.. కొన్ని రోజుల్లోనే వాటి సంఖ్య పెరిగి, అన్ని చోట్లా కనిపించడం మొదలవుతాయి.

వంటగది, బెడ్ రూమ్‌లలోని బొద్దింకలను వదిలించుకోవడానికి చాలా మంది ఖరీదైన మందులను వాడతారు. వాటిని ఇంట్లో అన్నిచోట్లా చల్లుతారు. అయినా కూడా బొద్దింకలు పూర్తిగా పూర్తిగా తొలగిపోవు. అయితే మీ ఇంట్లో ఉండే ఒక పదార్థాన్ని ఉపయోగించి బొద్దింకలను సులవుగా వదిలించుకోవచ్చు.

వంటగదిలోని లవంగాలను ఉపయోగించడం ద్వారా ఈ సమస్య నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వంటగదిలో లవంగాలను కేవలం మసాలాలు తయారు చేయడానికి మాత్రమే ఉపయోగించరు. వాటిని బొద్దింకలను తరిమికొట్టడానికి కూడా ఉపయోగించవచ్చు. వాటిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

బొద్దింకలకు లవంగాలు,వాటి వాసన అంటే ఇష్టం ఉండదు. లవంగాల వాసనకు బొద్దింకలు ఇంటి నుండి పారిపోతాయి. అందువల్ల, ఇంట్లో బొద్దింకలు ఉన్న ప్రదేశాలలో లవంగాలను ఉంచాలి. అలాగే లవంగాల పొడిని తయారు చేసి, ఇంట్లో బొద్దింకలు ఉన్న ప్రదేశాలలో చల్లవచ్చు. దీనివల్ల కొద్ది రోజుల్లోనే బొద్దింకలు ఇంటి నుండి శాశ్వతంగా పారిపోతాయి.

నోట్: ఈ వ్యాసంలోని సమాచారం అంతా ప్రాథమికమైనది. టీవీ9 తెలుగు ఈ విషయాను నిర్ధారించడం లేదు. ఏదైనా ప్రయోగం చేసే ముందు దయచేసి ఆ రంగంలోని నిపుణులను సంప్రదించండి.