
దుమ్ము, కాలుష్యం, ఒత్తిడి, మారుతున్న జీవనశైలి, పోషకాహార లోపాల కారణంగా ఈ మధ్య చాలా మంది చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అదిగమించేందుకు చాలా మంది మార్కెట్‌లో దొరికే హెయిర్ డైస్ వాడుతూ ఉంటారు. కానీ ఇది ఇన్‌స్టెంట్‌గా హెయిర్స్‌ను నల్లగా మార్చినా భవిష్యత్తులో ఇది ఇతర వెంట్రుకలను కూడా తెల్లగా మార్చవచ్చు.

కాబట్టి మన పూర్వికులు ఉపయోగించే ఈ చిట్కాను ఉపయోగించి మీరు కొన్ని నిమిషాల్లోనే మీ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. అవును పురాతన కాలం నుండి ఆరోగ్యకరమైన జుట్టు కోసం మన పూర్వికులు కరివేపాకులు, పెరుగును ఉపయోగిస్తున్నారు. తెల్ల జుట్టును నల్లగా చేయడంలో ఇవి రెండూ చాలా అద్భుతంగా పనిచేస్తాయి.

కరివేపాకు వాడటం వల్ల జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది. అలాగే ఒత్తైన, పొడవాటి జుట్టు పొందడంలో కూడా సహాయపడుతుంది. కరివేపాకులోని పోషకాలు తెల్ల జుట్టును వేర్లనుండి నల్లగా మార్చడంలో ప్రభావవంతంగా ఉంటాయి. కాబట్టి కరివేపాకు, పెరుగుతో కలిపిన హెయిర్ కలర్‌ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..

దీని కోసం, ముందుగా కరివేపాకులను శుభ్రంగా కడిగి, దాన్ని మెత్తని పేస్ట్‌లా రుబ్బుకోవాలి. తర్వాత ఈ పేస్ట్‌లో కాస్త పెరుగు యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. రెండు పూర్తిగా కలిసిన తర్వాత ఈ పేస్ట్‌ను మీ జుట్టుకు అప్లై చేసుకోవాలి. గంట తర్వాత గోరువెచ్చని నీరు, తేలికపాటి షాంపూతో మీ జుట్టును కడగాలి. ఇలా చేయడం ద్వారా మీ జుట్టు త్వరగా నల్లగా మారుతుంది.

Natural Hair Color (3)