ఈ విత్తనాలు పోషకాల పవర్‌హౌజ్‌..అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే.. ఒక్క గింజ కూడా వదలరు..

Updated on: Nov 01, 2025 | 10:31 AM

మస్క్‌మిలన్..ఇదే కర్బూజ.. ఈ పండు తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. ఇందులో ఫైబర్, నీటి శాతం, విటమిన్ సి, విటమిన్ ఎ ఉంటాయి. వేసవిలో దీనిని తప్పనిసరిగా తినాలి. ఇది వేడి, తేమ నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అయితే, మనందరం పుచ్చకాయ తిని దాని విత్తనాలను పరేస్తాం..కానీ, ఈ విత్తనాలలో ఔషధ శక్తి దాగి ఉందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవును కర్జూజ గింజలను అనేక విధాలుగా తినవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. కర్బూజ విత్తనాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం...

1 / 5
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది : కర్బూజ గింజలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ కలిగి ఉంటాయి. ఒమేగా-3లు మొత్తం గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి.. అలాగే గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి మేలు చేస్తుంది.. కర్బూజ గింజలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సాయపడే శోథ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంటాయి.

2 / 5
జీర్ణక్రియ ఆరోగ్యం : కర్బూజ గింజల్లో డైటరీ ఫైబర్ ఉంటుంది. మీ ఆహారంలో తగినంత డైటరీ ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. అది క్రమంగా ప్రేగు కదలికను సులభతరం చేసేలా చేస్తుంది. మలబద్ధకాన్ని అరికడుతుంది. ప్రేగులను ఆరోగ్యకరమైనదిగా మారుస్తుంది.

3 / 5
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: కర్బూజ గింజలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడతాయి. ఇన్ఫెక్షన్‌లను దూరంగా ఉంచుతాయి. ఈ గింజల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీంతో రోగనిరోధక వ్యవస్థ పనితీరును బలంగా ఉంచుతుంది. వివిధ యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి.

4 / 5
ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు పోషణ : కర్బూజ గింజల్లో విటమిన్ ఎ, సి, ఇ పుష్కలంగా ఉన్నాయి. మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ పోషకాలు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. చర్మం వృద్ధాప్యాన్ని మరింత ఆలస్యం చేస్తాయి. దీంతో వయసు కనిపించకుండా ఉండి యవ్వనంగా ఉంటారు.

5 / 5
పుచ్చకాయ, కీర దోస, మస్క్‌ మిలాన్‌ వంటి పండ్లు శరీరాన్ని చల్లబరుస్తాయి. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు శీతాకాలంలో ఈ పండ్లు జీర్ణం కావడం కష్టం. ఇది శ్లేష్మం పెంచుతుంది. ఇది జలుబు, గొంతు నొప్పి పెంచుతుంది. దీనిలోని అధిక నీటి శాతం చల్లని వాతావరణంలో శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.