భారీ వర్షాలతో ముంబై నగరం అతలాకుతలమవుతోంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. ఒక్క తూర్పు మలద్ ప్రాంతంలోనే మంగళవారం ఉదయం గోడ కూలిపోయి 18 మంది మరణించగా.. శిథిలాల్లో పదేళ్ల బాలిక చిక్కుకుంది. ఇదే ప్రాంతంలో ఇళ్ళు కూలి 34 మంది, కురార్ గ్రామంలో 51 మంది గాయపడ్డారు. రాబోయే 24 గంటల్లో మరిన్ని వర్షాలు పడవచ్చునని వాతావరణ శాఖ హెచ్ఛరించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం పబ్లిక్ హాలిడే గా ప్రకటించింది. రైల్వే ట్రాక్ లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో… పలు రైలు సర్వీసులను రద్దు చేయడమో, రైళ్లను దారి మళ్లించడం చేశారు. రెస్క్యూ టీం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. వీటికి సంబంధించిన ఫోటోస్ చూడండి.