World Most Poisonous Snakes : ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములు..! కాటు వేసాయంటే నీళ్లు కూడా అడగరు.. స్పాట్ డెడ్..

|

Mar 30, 2021 | 8:38 PM

World Most Poisonous Snakes : పాము పేరు వింటే చాలు మనుషులు ఆమడదూరం జరుగుతారు.. ఎందుకంటే పాము కరిస్తే మామూలుగా ఉండదు.. అయితే ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
సముద్ర పాము: ఈ పాములు ఆగ్నేయాసియా, ఉత్తర ఆస్ట్రేలియాలో కనిపిస్తాయి. ఇది ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాములలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ పాము విషం కొన్ని మిల్లీగ్రాముల చుక్కలు మాత్రమే దాదాపు 1000 మంది మానవులను చంపేస్తుంది. ఈ పాము సముద్రంలో నివసిస్తుంది.. ఈ కారణంగా సామాన్య ప్రజలకు కనిపించదు.. కానీ చేపలు పట్టుకునేటప్పుడు మత్స్యకారులు కొందరు దాని భారిన పడి ప్రాణాలు విడుస్తారు..

2 / 5
లోతట్టు తైపాన్ : ఈ పాము భూమిపై అత్యంత విషపూరితమైన పాముగా పరిగణించబడుతుంది. ఇది ఒక కాటులో 100 మిల్లీగ్రాముల విషాన్ని విడుదల చేస్తుంది. 100 మంది మానవులను చంపడానికి ఈ విషం సరిపోతుంది. దాని విషం నాగుపాము కంటే 50 రెట్లు ఎక్కువ ప్రమాదకరమని నమ్ముతారు.

3 / 5
తూర్పు బ్రౌన్ స్నేక్ : ఈ జాతి పాము ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది. ఇది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన పాములలో ఒకటిగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి  మరణించడానికి దీని విషంలో వన్‌ పర్సంట్‌ మాత్రమే చాలు..

4 / 5
ఫిలిపినో కోబ్రా : ఈ పాముకి చెందిన చాలా జాతులు విషపూరితమైనవి.. ఈ పాము అతి పెద్ద లక్షణం ఏంటంటే.. మనిషిని కాటు వేయడానికి బదులుగా, దూరం నుంచే విషాన్ని చిమ్ముతుంది. దీని విషం న్యూరో టాక్సిక్, ఇది శ్వాస, గుండెను నేరుగా ప్రభావితం చేస్తుంది.

5 / 5
బ్లాక్ మాంబా ప్రపంచంలో అత్యంత విషపూరితమైన, ప్రమాదకరమైన పాములలో ఒకటి. ఒక మనిషిని చంపడానికి బ్లాక్ మింబా ఒక మిల్లీగ్రాము పాయిజన్ మాత్రమే సరిపోతుంది, కానీ ఈ పాము దాడి చేస్తే ఒకేసారి 10-12 సార్లు కరిచి అతడి శరీరంలో 400 మిల్లీగ్రాముల విషాన్ని విడుదల చేస్తుంది.