
సింహాన్ని అడవికి రారాజుగా పరిగణిస్తారు. కానీ అది అత్యంత తెలివైన జంతువు కాదు. చాలా మంది ఏనుగును అడవిలో అత్యంత తెలివైన జంతువుగా భావిస్తారు. అయితే ఈ సమాధానం కూడా తప్పు. మరైతే అడవిలో అత్యంత తెలివైన జంతువు ఏదీ అనే ప్రశ్నకు ఇక్కడ సమాధానం తెలుసుకుందాం..

పైన పేర్కొన్న జంతువులన్నీ అడవిలో అత్యంత తెలివైన జంతువులు కాకపోతే అడవిలో మరింత తెలివైన జంతువు ఏది అనే సందేహం మీకు కలగొచ్చు.

నిజానికి చింపాంజీలు అత్యంత తెలివైన జంతువులు. అవి అడవిలో మాత్రమే కాకుండా పెంపుడు జంతువులలో కూడా అత్యంత తెలివైన జంతువులు. అందుకే చింపాంజీలను మానవులకు అత్యంత దగ్గరి బంధువులుగా పరిగణిస్తారు.

చింపాంజీల DNA 98% మానవుల మాదిరిగానే ఉంటుంది. మిగతా జంతువులన్నీ వాటితో పోలిస్తే తెలివితేటలు చాలా తక్కువ. ఎందుకంటే చింపాంజీలు వేట కోసం ఉపకరణాలను తయారు చేస్తాయి. అవి గింజలను పగలగొట్టడానికి రాళ్లను ఉపయోగిస్తాయి.

చింపాంజీలు ప్రాథమిక అంకగణితాన్ని కూడా నేర్చుకోగలవు. సమస్యలను పరిష్కరించడంలో ఇవి నేర్పరులు. పరిశీలన ద్వారా అవి ఎన్నో విషయాలు నేర్చుకోగలవు. అలాగే అడవిలో అత్యంత డేంజరస్ జంతువు కూడా చింపాంజీనే. కోపం వస్తే చాలా క్రూరంగా ప్రవర్తిస్తాయి.