
జైపూర్‌లోని జల్ మహల్ వర్షాకాలంలో మరింత అందంగా కనిపిస్తుంది. ఈ భవనం మానసాగర్ సరస్సు మధ్యలో ఉండడంతో పర్యాటకుల్ని మరింత ఆకర్షిస్తూ కనువిందుగా కనిపిస్తుంది. జల మహల్ 1799లో మహారాజా సవాయి ప్రతాప్ సింగ్ నిర్మించారు. అనేకసార్లు ఈ భవనానికి మరమ్మతులు కూడా నిర్వహించారు. జల్‌మహల్ చుట్టూ ఉన్న నీళ్లలో ఈ మహల్ దృశ్యం చాలా అందంగా కనిపిస్తుంది. జల్ మహల్ అనేది ఐదు అంతస్తుల రాజభవనం. వీటిలో నాలుగు అంతస్తులు నీటిలో ఉన్నాయి. వీటిని మీరు చూడలేరు. నీటి పైన ఒక అంతస్తు మాత్రమే కనిపిస్తుంది.

జల్ మహల్ ఐదు అంతస్తుల భవనం. కానీ నీటి పైన ఒక అంతస్తు మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన నాలుగు అంతస్తులు నీటి కింద ఉన్నాయి. ఈ కారణంగానే ఈ ప్యాలెస్ వేడిగా అనిపించదు. పౌర్ణమి వెన్నెల రాత్రులలో సరస్సు నీటిలో ప్యాలెస్ ప్రతిబింబించినప్పుడు ఈ ప్యాలెస్ దృశ్యం చాలా అందంగా ఉంటుంది. జల మహల్ 1799లో మహారాజా సవాయి ప్రతాప్ సింగ్ నిర్మించారు. అనేకసార్లు ఈ భవనానికి మరమ్మతులు కూడా నిర్వహించారు.

జల్ మహల్ నిర్మాణం వెనుక కూడా అంతుచిక్కని ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. నీటి లోపల దాని స్థానం ఒక అద్భుతం కంటే తక్కువ కాదు. ప్యాలెస్ పునాది ఎలా వేయబడిందనే దాని గురించి ఎవరికీ ఖచ్చితమైన సమాచారం లేదు. దీనిని ఎర్ర ఇసుకరాయితో నిర్మించారు. ఇది ఇప్పటికీ అదే వైభవంతో నిలుస్తుంది. జల్ మహల్ పైన ఉన్న అంతస్తులో ఒక నర్సరీ ఉంది. దీనిలో లక్షకు పైగా చెట్లను నాటారు. వాటిని సంరక్షించడానికి 40 మంది తోటమాలి నియమించబడ్డారు. ఈ నర్సరీ రాజస్థాన్‌లో ఎత్తైన నర్సరీగా పరిగణించబడుతుంది.

ఒంటె, గుర్రపు స్వారీ, నైట్ మార్కెట్ , మినీ చౌపాటి పర్యాటకులను ఆకర్షిస్తాయి. సాయంత్రం సమయంలో ఇక్కడ రాజస్థానీ జానపద పాటలు , నృత్యాలు ప్రదర్శిస్తారు. వర్షాకాలంలో జల మహల్ అందం రెట్టింపు ఉంటుంది. ఈ జల్ మహల్ 300 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి 4 మీటర్ల లోతులో ఉంది. తక్కువ ఖర్చుతో జైపూర్ టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడకి రైలు , బస్సు సౌకర్యం ఉంటుంది. అన్ని సీజన్ల కన్నా వర్షాకాలంలో జైపూర్ వెళ్లినట్టైతే జల్ మహల్ ని తప్పకుండా చూడండి. అయితే, ఈ ప్యాలెస్ లోపలికి ప్రవేశం లేదు. మీరు దానిని బయటి నుండి మాత్రమే చూడగలరు కానీ లోపలికి ప్రవేశించడానికి అనుమతి లేదు.

జల్ మహల్ ఒక చారిత్రక వారసత్వం. ఇది ఇప్పటికీ అనేక సందేహాలను కలిగిస్తుంది. దాని లోపల ఏముంది. ఈ ప్యాలెస్ నీటిలో మునిగిపోయినప్పటికీ సంవత్సరాలుగా ఎందుకు చెక్కుచెదరకుండా ఉంది అనేది ఎవరికీ అంతుచిక్కని రహస్యం. ఈ జల్ మహల్ జైపూర్ ముఖ్యమైన, చారిత్రక వారసత్వంగా నిలిచి ఉంది. ఇది ఇప్పటికీ మన చరిత్ర, సంస్కృతిని గుర్తు చేస్తుంది.