
టైల్స్ వేశాక చాలా వరకు ఇల్లు కడగడాలు తగ్గాయి. ఎప్పుడో పండుగల సమయంలోనే ఇళ్లను కడుగుతున్నారు. చాలా వరకు మోపింగ్ మాత్రమే పెడుతున్నారు. టైల్స్ పై మరకలు మచ్చలు పడితే రెండు రోజులకు ఒకసారి కూడా పెడుతూ ఉంటారు. ఇలా మోప్ పెట్టినా పెట్టనట్టే ఉంటుంది.

ఇప్పుడే కదా తుడిచాను.. అయినా తుడవనట్టు ఇలా ఉందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇది కేవలం మీరు చేసే కొన్ని పొరపాట్ల కారణంగానే ఇలా మోపింగ్ పెట్టినా.. పెట్టనట్టు ఉంటుంది.

మోపింగ్ పెట్టడం కోసం బకెట్ నీళ్లను ఉపయోగిస్తూ ఉంటాం. కాస్త పెట్టే సరికి అవి మురికిగా మారతాయి. అయినా కూడా ఈ నీళ్లనే ఉపయోగిస్తూ ఇంటి మొత్తం పెడతారు. ఇలా మురికి నీటిని ఉపయోగిస్తే ఫ్లోర్ పై మురికి పోదు. దానికి తోడు క్రిములు, బ్యాక్టీరియా వృద్ధి చెందుతాయి.

నీళ్లు మురికి అనిపిస్తే వెంటనే మార్చేయండి. లేదంటే సగం బకెట్ నీళ్లు ఉపయోగిస్తూ ఉండండి. అప్పుడు నీళ్లు కూడా వృథా కావు. ఇక ఫ్లోర్ క్లీన్ చేసేందుకు కెమికల్ ప్రోడెక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు.

అలాంటి కెమికల్ ప్రోడెక్ట్స్ వల్ల కూడా మీ టైల్స్ మెరుపు తగ్గిపోతుంది. వాటికి బదులు ఇంట్లో ఉండే ఉప్పు, బేకింగ్ సోడా, పసుపు, డెటాల్, సర్ఫ్ వంటివి ఉపయోగిస్తే చాలు.