
ఉదయం పూట మంచిగా ఉన్నవి మాత్రమే తీసుకోవాలి అలా అని గ్యాస్ పట్టే ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదు ఇలా తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. మీరు ఇప్పటి నార్మల్ అట్టుతోనే తిని తింటారు. ఇప్పుడు కొత్తగా పెసరపప్పు దోసె ట్రై చేయండి. దీని కోసం పెసరపప్పు వాడితే చాలు. ఈ దోసెలు మెత్తగా, స్పాంజిలా వస్తాయి. అల్లం, పచ్చిమిర్చి వేస్తే వానాకాలంలో మంచిగా అనిపిస్తుంది.

పెసరట్టు కావాల్సిన పదార్దాలు : రెండు కప్పుల పెసరపప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ , మూడు పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, మూడు కప్పుల పెరుగు, అర టీ స్పూన్ బేకింగ్ సోడా, కొత్తిమీర తరుగు, అర కప్పు కరివేపాకు ఆకులు, ఒక టీ స్పూన్ నూనె లేదా కొద్దిగా నెయ్యి వేస్తే దోసెలు మంచిగా అవుతాయి. అయితే, మీరు వీటికి సరిపడా తీసుకుంటే సరిపోతోంది.

పెసరట్టు తయారి విధానం : ముందుగా పెసరపప్పు తీసుకుని 6 గంటలు పాటు బాగా నానాబెట్టుకోవాలి. అయితే, వీటి నుంచి నీటిని వేరు చేసి ఆ తర్వాత మిక్సీలో పెసరపప్పు, అల్లం ముక్కలు , కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి నీటిని పోస్తూ మెత్తని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి దీనిని మరి మెత్తగా కాకుండా బరకగా పట్టుకోవాలి.

పెసరట్టు తయారి విధానం స్టెప్ 1 : ఈ పిండిలో రుచికి తగినంత ఉప్పు, కట్ చేసిన కొత్తిమీర ఆకులు , ఒక కప్పు పెరుగు కూడా వేసి మంచిగా కలపండి. ఇలాగే గంట పాటు దీనిని మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఈ అట్టులు వేసే ముందు బేకింగ్ సోడా కలిపితే ఇవి స్పాంజిలాగా అవుతాయి.

పెసరట్టు తయారి విధానం స్టెప్ 2 : గ్యాస్ పొయ్యి వెలిగించి వేడి పెనం పెట్టి దాని మీద ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది బాగా వేడయ్యాక గరిటేతో పిండిని తీసుకుని దాని మీద కొంచం మందంగా పోసి అట్టులా తిప్పుకుని మూతపెట్టి కాల్చుకోవాలి అంచుల చుట్టూ నూనె కానీ నెయ్యి వేసి రెండో వైపు కూడా తిప్పి కాల్చండి. అంతే వేడి వేడి పెసరట్టు రెడీ. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ లేదా పల్లీ చట్నీతో వడ్డించండి.