Basha Shek |
Jun 08, 2022 | 6:13 PM
1999లో అరంగేట్రం చేసిన మిథాలీ 23 ఏళ్ల పాటు భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. భారత్‌లో అత్యధిక ఆదాయం ఆర్జిస్తోన్న క్రికెటర్‌గా గుర్తింపు పొందింది.
మిథాలీ రాజ్ నికర ఆస్తుల విలువ సుమారు రూ. 36.6 కోట్లని తెలుస్తోంది. క్రికెట్ ద్వారానే ఆమె ఎక్కువ ఆదాయం ఆర్జిస్తోంది. దీంతో పాటు సోషల్ మీడియా ప్రకటనలు, ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా బాగా డబ్బు వస్తోంది.
మిథాలీ దగ్గర చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈ జాబితాలో రూ.2.2 కోట్ల విలువైన 320-డి బిఎమ్‌డబ్ల్యూ కారు కూడా ఉంది.
రూ. 35.49 లక్షల విలువైన హోండా అకార్డ్, 8.49 లక్షల విలువైన రెనాల్ట్ డస్టర్ కూడా ఆమె గ్యారేజ్‌లో ఉన్నాయి.
మిథాలీ Uber, Lever & Woods, Ellen Solly, American Tourister, Fast Up India వంటి బ్రాండ్‌ల ఉత్పత్తులకు ప్రమోటర్‌గా వ్యవహరిస్తోంది.
మిథాలీ రాజ్‌కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 1.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఫేస్‌బుక్‌లో 4.5 మిలియన్ల ఫాలోవర్లు మరియు ట్విట్టర్‌కు 873.7 వేల మంది ఫాలోవర్లు ఈ లెజెండరీ క్రికెటర్‌కు ఉన్నారు. సోషల్ మీడియాలో ఎండార్స్‌మెంట్స్ ద్వారా ఆమె రూ. 50 లక్షలు మేర సంపాదిస్తోంది.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ కాలం పాటు కెరీర్ కొనసాగించిన ఆటగాళ్లలో మిథాలీ రాజ్ ఒకరు. 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఆమె ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నారు.
కాగా నాలుగేళ్ల క్రితం కోచ్ రమేశ్ పొవార్‌తో జరిగిన వివాదం భారత క్రికెట్‌లో ప్రకంపనలు రేపింది. అప్పటివరకు కేవలం ఆటతోనే వార్తల్లో నిలిచిన మిథాలి ఈ వ్యవహారంతో వివాదాల్లో చిక్కుకుంది.
భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది.