
ప్రస్తుతం రబీ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. దీని తర్వాత రైతులు మళ్లీ పంట వేసేందుకు కొన్ని రోజుల గ్యాప్ తీసుకుంటారు. కానీ ఈ గ్యాప్‌లో కొన్ని ఆకుకూరలు పండించడం ద్వారా అన్నదాతలు అద్భుతమైన లాభాలను పొందవచ్చు. అవును సాధారణంగా ఆలు, ఉల్లి పంటలు ఫిబ్రవరి నాటికి చేతికోస్తాయి. దీని తర్వాత మర్చి, టామాటా వంటి పంటలను వేసేందుకు రైతులు సుమారు నెల నుంచి రెండు నెలల టైం తీసుకుంటారు. ఈ టైంలో రైతులు జస్ట్ 40 నుంచి 50 రోజుల్లో పంట చేతికి వచ్చే ఆకుకూరలను పండించడం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు.

ప్రస్తుతం ఉల్లి, ఆలూ సాగు తర్వాత పొలం ఖాళీగా ఉన్న రైతులు వెంటనే మీ పొలాన్న చదును చేసి పాలకూర, మెంతికూర, తోటకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలను పెంచడం ప్రారంభించండి. మీరు విత్తనాలు వేసిన నాటి నుంచి కేవతం 20 రోజుల్లోనే మీకు పంట మొదటి కాపుకు వస్తుంది. వేసవిలో ఆకుకూరలు డిమాండ్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి మీరు మంచి లాభాలను పొందవచ్చు.

ఇక్కడ మీకు మరో బెనిఫిట్ ఏమిటంటే ఆకు కూరలు సాగు చేసేందుకు మీకు పెద్దగా పెట్టుబడి కూడా అవసరం ఉండదు. మీరు ఎకరం పొలంలో ఆకు కూరలు సాగు చేసేందుకు విత్తనాలు, ఎరువులు కలుపుకుంటే మొత్తం రూ.5-8వేల వరకు మాత్రమే పెట్టుబడి అవసరం అవుతుంది. అలాగే మార్కెట్ ధరను బట్టి మీరు నెల రోజుల్లో రూ.30-40వేల వరకు ఆదాయాన్ని పొందవచ్చు.

అయితే మీరు పొలాన్ని ఎప్పుడూ సాగు చేస్తూనే ఉండాలనుకుంటే..మీ పొలంలో ఆకుకూరల సాగు చేస్తున్న సమయంలోనే ఒక పక్కకు తర్వాత వేయాల్సిన టామాటా, మిర్చి పంటకు కావాల్సిన నారును పెంచుకోవచ్చు. దీంతో మీరు ప్రస్తుతం పెంచుతున్న ఆకుకూరలు సాగు పూర్తికాగానే ఆ ప్రాంతాన్ని కాస్తా చదును చేసి అదే గట్లపై టామాటా, మర్చి నారును చల్లుకోవచ్చు.

మీరు టమాటా, లేదా మిర్చీ నారు వేసిన నెల రోజులకే పూత పట్టడం, కాపు ప్రారంభం అవుతుంది. ఆ కాపును మీరు తెంచుకొని మార్కెట్‌లో అమ్ముకొవచ్చు. ఇలా చేయడం ద్వారా మీరు పొలాన్ని నిరంతరం సాగు చేస్తూ ఆదాయాన్ని గడించవచ్చు.( Note : పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 ధృవీకరించట్లేదు)