Neem Leaves: ఒక్క వేపాకుతోనే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు..

|

Jan 11, 2025 | 3:34 PM

వేపాకులో ఎన్నో ఔషధ గుణాలు లభిస్తాయి. అందుకే ఈ చెట్టును పూజిస్తారు. వేపాకు చెట్టు గాలి రోజూ పీల్చినా కూడా ఎన్నో శ్వాస సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ చెట్టు ఆకులు, కాయలు, బెరడు అన్నీ ఉపయోగకరమైనవే. రోగాలు రాకుండా అడ్డుకోవడంలో వేపాకు సహాయ పడుతుంది..

1 / 5
వేపాకు ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే వేప చెట్టును దేవతా స్వరూపంగా భావిస్తారు. వేపాకులు, బెరడు, కాయలు.. ఇలా చెట్టులోని అన్నింటిలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వేపాకును సరిగ్గా ఎన్నో వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.

2 / 5
క్యాన్సర్‌ని కంట్రోల్ చేసే గుణాలు సైతం వేపాకుల్లో లభిస్తాయి. వేపాకులు నీటిలో మరిగించి.. ఆ నీటిని తాగితే.. క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తుంది. క్యాన్సర్ రాకుండా అడ్డుకునే సామర్థ్యం ఈ వేపాకుల్లో ఉంది.

క్యాన్సర్‌ని కంట్రోల్ చేసే గుణాలు సైతం వేపాకుల్లో లభిస్తాయి. వేపాకులు నీటిలో మరిగించి.. ఆ నీటిని తాగితే.. క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తుంది. క్యాన్సర్ రాకుండా అడ్డుకునే సామర్థ్యం ఈ వేపాకుల్లో ఉంది.

3 / 5
జుట్టుకు సంబంధించిన సమస్యలను కూడా తగ్గుతుంది. చుండ్రు, ఇతర జుట్టు సమస్యలతో బాధ పడేవారు. వేపాకులను మరిగించిన నీటిని.. తలస్నానం అనంతరం గోరు వెచ్చగా తలపై నుంచి పోసువాలి. వేపాకు పేస్టును తలపై రాసుకున్నా చుండ్రు, పేలు, జుట్టు రాలడం కూడా కంట్రోల్ అవుతుంది.

4 / 5
వేపాకులు మరిగించిన నీటిని పుక్కిలించడం వల్ల కూడా నోటి సమస్యలు రాకుండా ఉంటాయి. పరగడుపున పచ్చి వేపాకులు నమిలి తిన్నా.. నోటికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి.

వేపాకులు మరిగించిన నీటిని పుక్కిలించడం వల్ల కూడా నోటి సమస్యలు రాకుండా ఉంటాయి. పరగడుపున పచ్చి వేపాకులు నమిలి తిన్నా.. నోటికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి.

5 / 5
వేపాకు పేస్టులో కొద్దిగా తేనె లేదా పెరుగు, తేనె మిక్స్ చేసి ముఖానికి రాసుకుంటే.. చర్మ సమస్యలు దూరమవుతాయి. చర్మ కాంతి కూడా మెరుగు పడుతుంది. నల్ల మచ్చలు, మొటిమలు, దురద వంటివి కూడా దూరమవుతాయి. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

వేపాకు పేస్టులో కొద్దిగా తేనె లేదా పెరుగు, తేనె మిక్స్ చేసి ముఖానికి రాసుకుంటే.. చర్మ సమస్యలు దూరమవుతాయి. చర్మ కాంతి కూడా మెరుగు పడుతుంది. నల్ల మచ్చలు, మొటిమలు, దురద వంటివి కూడా దూరమవుతాయి. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)