
వేసవిలో ముందు గుర్తొచ్చేది ఏదైనా ఉంది అంటే అది పండిన మామిడి పండ్లే. ఇక భారతదేశంలో అయితే ఎంతో మంది తింటారు. ఈ తియ్యటి పండు ఎప్పటినుంచో ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఈ ఏడాది ఎప్పుడు ఉండే దాని కన్నా చాలా ఎక్కువ ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

'హ్యాండ్‌పిక్డ్' యాప్ తెలిపిన వివరాల ప్రకారం, తొలిసారి కొనుగోలు చేసేవారిలో పనీర్‌ను కూడా మామిడికాయలు వెనక్కి నెట్టాయి. అసలు ఏ కాలంతో సంబంధం లేకుండా.. అత్యధికంగా కొనుగోలు చేసిన పనీర్ ఈ ఏడాది వెనుక పడిందే అని చెప్పుకోవాలి. ఈ మే నెలలో, ప్రత్యేకంగా ఎంతో మంది పనీర్ కన్నా మామిడి వైపే మొగ్గు చూపుతున్నారు.

గత ఏడాది పోలిస్తే, మామిడి ఆర్డర్లు 5-7 శాతం పెరిగింది. ఇదొక అర్థవంతమైన మార్పు అని నివేదిక చెబుతుంది. ఈ సీజన్‌లో ఆర్డర్ల పరంగా స్టాక్-కీపింగ్ యూనిట్ లిస్ట్ లో పచ్చి మామిడి మొదటి స్థానంలో నిలిచింది. అల్ఫోన్సో, కేసర్ మామిడికాయలు కూడా కొనుగోళ్ళు జరిగాయి. బంగనపల్లి, ఇమామ్ పసంద్, రస్పూరి, తోతాపురి వంటి మామిడి కూడా రికార్డ్ అమ్మకాలను నమోదు చేసాయి.

ఇవి ఏరియాలను బట్టి ఇది మారుతూ ఉంటుంది. బెంగళూరులో ఇమామ్ పసంద్, రస్పూరి వాటి వాటికి ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇంకా గురుగ్రామ్‌లో డెజర్ట్‌లకు పేరు గాంచిన కేసర్, అల్ఫోన్సో మామిడి పండ్లకు ప్రాధాన్యతను ఇస్తున్నారు. వారంలోనే ఈ ఆర్డర్ల సంఖ్య నిలకడగా పెరుగుతుంది.

మామిడి పండ్లకు గిరాకీ బాగా పెరుగుతుంది. కానీ , ప్రపంచ ప్రసిద్ధి చెందిన అల్ఫోన్సో మామిడికి మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో, రైతులు పంట కోసం ఎంతగానో పోరాడుతున్నారు. ఎందుకంటే, అకాల వర్షాలు ఆ తర్వాత తీవ్రమైన వడగాలులు రావడంతో ఆ దెబ్బకు పండ్ల తోటలను తీవ్రంగా దెబ్బతీశాయి, దీని వలన దిగుబడులు 80 శాతం తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి.