
ఈ మధ్య కాలంలో చాలా మంది స్లిమ్‌గా, అందంగా కనిపించాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం జిమ్‌కు వెల్లడం, డైట్స్ ఫాలో అవ్వడం చేస్తున్నారు. ఈ డైట్‌లో త్వరగా బరువు తగ్గాలని కొంతమంది వేరుశెనగలు తీసుకుంటే, మరికొందరు మఖానాను ఇష్టపడుతారు. కానీ ఈ రెండింటిలో ఏది త్వరగా బరువు తగ్గడానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది అనే దాని గురించి పోషకాహార నిపుణురాలు స్నేహ పరంజాపే కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

వేరుశెనగలో ప్రోటీన్, ఫైబర్, అవసరమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వేరుశెనగలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, అవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే ఎక్కువ కాలం మిమ్మల్ని కడుపు నిండినట్లు ఉంచుతాయని తెలిపారు. అంతేకాదు వేరుశెనగలో కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి, కాబట్టి వాటిని మితంగా తీసుకోవడం ముఖ్యం. 5-6 వేరుశెనగలు తినడం వల్ల బరువు తగ్గడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. వాటిలోని అధిక కేలరీల కంటెంట్ అధికంగా తీసుకుంటే బరువు పెరగడానికి దారితీస్తుంది.

మఖానా అనేది కేలరీలు తక్కువగా ఉండే పోషకాహారం. ఇందులో కొవ్వు తక్కువగా ఉంటుంది,అలాగే ప్రోటీన్. ఫైబర్ అధికంగా ఉంటుంది. మఖానా తినడం వల్ల మీ ఆకలి అదుపులో ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియ ప్రక్రియను కూడా సజావుగా ఉంచుతుంది. మఖానాలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి వివిధ శరీర విధులకు సహాయపడతాయి. ఇది బరువు తగ్గడానికి మంచి ఎంపికగా మారుతుంది.

పోషకాహార నిపుణురాలు స్నేహా పరాంజపే ప్రకారం బరువు తగ్గాలి అనుకునే వారికి పల్లీలతో పోల్చుకుంటే మఖానా మంచి ఎంపిక అని చెబుతున్నారు. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి, అలాగే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది త్వరగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.

అయితే మీరు జస్ట్ ఆకలిని నియంత్రణలో ఉంచుకోవాలి అనుకుంటే తక్కువ మోతాదులో పల్లీలు తీసుకోవడం ఉత్తమం. అందువల్ల, మీ ఆహారాన్ని సమతుల్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం ముఖ్యం. (Note: పైన పేర్కొన్న అంశాలు నివేదికలు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం ఆదారంగా అందించబడింది. వీటిని టీవీ9 దృవీకరించడం లేదు. వీటిపై మీకేవైనా సందేమాలు ఉంటే నిపుణులను సంప్రదించండి)