
కాగా, ఇప్పుడు మనం సాముద్రిక శాస్త్రం ప్రకారం, స్త్రీలకు శరీరంలో ఏ ప్రదేశాలలో పుట్టు మచ్చలు ఉండటం మంచిది? ఏ స్థానంలో పుట్టు మచ్చ ఉంటే వారు అదృష్టవంతులు అవుతారో వివరంగా తెలుసుకుందాం.

పుట్టు మచ్చల శాస్త్రం ప్రకారం, ఏ స్త్రీకి అయితే నుదిటి పై పుట్టు మచ్చ ఉంటుందో, ఆమెకు అదృష్టం కలిసి వస్తుందంట. ప్రారంభంలో ఆమె సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ, 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ధనవంతు రాలు అవుతుందని చెబుతున్నారు సాముద్రిక శాస్త్ర నిపుణులు. ఇక నుదుటిపై కుడి వైపున ఉంటే సమాజంలో గౌరవం పొందుతుంది. ఎడమ వైపున పుట్టు మచ్చ ఉంటే, ఆమె చాలా కష్టాలు పడాల్సి వస్తుందంట.

అలాగే ఏ స్త్రీకి అయితే గడ్డంపై పుట్టు మచ్చ ఉంటుందో, ఆమె చాలా కష్టపడే స్వభావం గల వ్యక్తి. అంతే కాకుండా ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉంటుంది. వీరు చాలా ప్రశాంతమైన వారు, అంతే కాకుండా గడ్డంపై పుట్టు మచ్చ ఉన్నవారు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే భయపడకుండా ముందుకు సాగుతారు. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వీరు తన కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి ఇష్టపడతారు.

అదే విధంగా ఏ స్త్రీకి అయితే మెడపై పుట్టు మచ్చ ఉంటుందో, ఆ మహిళ అన్ని రంగాల్లో విజయం సాధిస్తుంది. వీరికి ఆర్థిక పరమైన సమస్యలే ఉండవు, చాలా ముందు చూపుతో ప్రవర్తిస్తారు. ఇలాంటి స్త్రీలు సంపదకు కీలకమైన వ్యక్తులు అని చెప్పవచ్చు. వీరు తప్పకుండా ధనవంతులు అవుతారు.

అరచేతిలో పుట్టు మచ్చ ఉంటే చాలా అదృష్టం అని చెప్పాలి. ఏ స్త్రీకి అయితే అర చేతి మధ్య భాగంలో పుట్టు మచ్చ ఉంటుందో వారు జీవితంలో కోటీ శ్వరులు అవుతారంట. వీరికి దానం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా వీరు ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. వీరికి సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.