
మోహిని మొక్క: మోహిని మొక్కను ఇంట్లో తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచాలి. ప్రధానంగా దక్షిణాఫ్రికాలో కనిపించే ఈ మొక్కను వాస్తుశాస్త్రం ప్రకారం పొరపాటున కూడా ఈ మొక్కను దక్షిణ దిశలో పెట్టకూడదు.

శమీ మొక్క: శమీ మొక్క శివునికి చాలా ప్రీతికరమైనది. ఈ మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. ఈ మొక్క ఆకులతో సోమవారం నాడు శివునికి నైవేద్యంగా పెట్టడం వల్ల సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయి.

దానిమ్మ మొక్క: హిందూ విశ్వాసం ప్రకార, ఇంటి కుడి వైపున దానిమ్మ మొక్కను నాటితే లక్ష్మి దేవి, కుబేరకృపతో ఐశ్వర్యవంతులు అవుతారు.

మనీ ప్లాంట్: మనీ ప్లాంట్ చాలా అందంగా కనిపించడమేకాక పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుతుంది. ఈ మొక్కను ఇంట్లో ఉంచితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

Plants