కొత్తిమీరలో విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ కే, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అలాగే ప్రోటీన్, ఫైబర్ కూడా లభిస్తాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు ఉన్న వారికి కొత్తిమీర రసం వాటి నుంచి ఉపశమనం ఇస్తుంది. నోట్లో అల్సర్లు, పగుళ్లు, దుర్వాసనతో బాధపడుతుంటే కొత్తిమీర ఆకులు నమలడం వల్ల అవి నయమవుతాయి. కొత్తిమీర ఆకులను కషాయంగా చేసి పుక్కిలిస్తే చిగుళ్ల నొప్పులు, దంతాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.