
చలికాలంలో నానబెట్టిన బాదంపప్పును తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇలా తినడం వల్ల శరీరం పోషకాలను త్వరగా గ్రహించడమే కాక ఆహారం కూడా సులభంగా జీర్ణమవుతాయి.ఇంకా ఇవి గుండె ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

చలికాలంలో పాలు, బాదంపప్పు తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. కావాలనుకుంటే బాదంపప్పును పాలతో కలిపి తినవచ్చు లేదా పౌడర్ చేసి పాలలో కలుపుకోవచ్చు.

మీరు బాదంపప్పులను నానబెట్టడం మరచిపోయినా వాటిని కాల్చుకుని తినవచ్చు. నిజానికి పచ్చి బాదం కంటే కాల్చిన బాదంలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. మీరు అల్పాహారం లేదా రాత్రి భోజనం కోసం కూడా కాల్చిన బాదంపప్పులను తినవచ్చు.

Almonds Health Benefits

బాదంపప్పులో ఒమేగా 3, విటమిన్ ఇ, జింక్, మెగ్నీషియం, ప్రొటీన్, ఫైబర్ లభిస్తాయి. బాదంపప్పును ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టి ఆ తర్వాత పిల్లలు, గర్భిణులు, వృద్ధులు తినవచ్చు.