వర్షాకాలంలో జబ్బులను తరిమికొట్టే సూపర్ డ్రింక్.. రోజూ తాగితే రోగాలు మిమ్మల్ని టచ్‌ కూడా చెయ్యవు..

Updated on: Jun 10, 2026 | 6:02 PM

వర్షాకాలం స్టార్ట్ అయ్యింది. సాయంత్రం అయితే వెదర్ మొత్తం చల్లగా మారిపోతుంది. ఇలాంటి టైంలో వేడివేడిగా లెమన్ టీ తాగడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? వెదర్‌ను ఎంజాయ్ చేస్తూ అలా లేమన్ టీ తాగుతుంటే.. ఆ అనుభూతే వేరు. అదొక్కటే కాదు వర్షాకాలంలో లెమన్ టీ తాగడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం

1 / 5
లివర్ క్లెన్సింగ్:  వర్షాకాలంలో లెమన్ టీ తాగడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ కాలేయాన్ని శుభ్రపరిచే గుణాన్ని కలిగి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఒక కప్పు లెమన్ టీ తాగడం వల్ల శరీరంలోని అనవసర వ్యర్థాలు, లివర్‌లో పేరుకుపోయిన టాక్సిన్స్ అన్నీ శుభ్రపడి బయటకు వచ్చేస్తాయి. దీనివల్ల శరీరం మొత్తం డిటాక్స్ అవుతుంది.

2 / 5
శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది: నిమ్మకాయలో ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించి, శరీరాన్ని లోపలి నుండి క్లీన్ చేస్తాయి. అలాగే నిమ్మకాయలో ఉండే ఫైబర్ ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, ఇది ఆకలిని అదుపులో ఉంచి, కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. దీనివల్ల ప్రేగుల కదలికలు మెరుగై, శరీర మెటబాలిజం పెరుగుతుంది.

3 / 5
డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది: ఎండాకాలంలోనే కాదు వర్షాకాలంలో కూడా మన బాడీ డీహైడ్రెడ్ అవుతుంది. అవును వర్షాకాలంలో మనం తరచూగా యూరిన్‌కి వెళ్లాల్సి వస్తుంది, అలాగే జీర్ణక్రియ కూడా కాస్త నెమ్మదిగా సాగుతుంది. దీనికోసం శరీరానికి ఎక్కువ నీరు అవసరం. కాబట్టి వర్షాకాలంలోనూ తగినంత నీరు తాగాలి. రోజుకు ఒక గ్లాసు లెమన్ టీ లేదా లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల శరీరం ఎక్కువ సేపు హైడ్రేటెడ్‌గా ఉంటుంది.

4 / 5
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: నిమ్మకాయలోని విటమిన్-సి ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అలాగే, టీలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇమ్యూనిటీని పెంచడానికి అద్భుతంగా సహాయపడతాయి. అంతే కాదు లెమన్ టీ మన చర్మ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్-సి, ఇతర పోషకాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.

5 / 5
యూరినరీ ఇన్ఫెక్షన్లకు చెక్: సాధారణంగా వర్షాకాలంలో బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాప్తి చెందుతాయి. దీనివల్ల చాలా మందికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్య వస్తుంది. మూత్రవిసర్జన సమయంలో మంట, బొట్లు బొట్లుగా మూత్రం రావడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే లెమన్ టీ తాగడం వల్ల నిమ్మకాయలోని విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు ఆ ఇన్ఫెక్షన్ కలిగించే క్రిములతో పోరాడి ఉపశమనాన్ని కలిగిస్తాయి. మొత్తంగా రెయినీ సీజన్‌లో లెమన్ టీ తాగడం మన ఆరోగ్యానికి అన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది.

Follow Us