Biggest Earthquakes: ప్రపంచంలో ఇప్పటివరకు సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపాలు ఇవే!

Updated on: Jul 30, 2025 | 3:10 PM

రష్యాలో ఏర్పడిన అత్యంత శక్తి వంతమైన భూకంపం అతలాకుతలం చేసేసింది. కంచట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్‌స్క్‌ తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 8.7గా నమోదైంది. రష్యాలోనే కాదు ప్రంపంలోనే ఇంత శక్తవంతమైన భూకంపం సంభవించడం గడిచిన 24 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ భూంకంపం ఒక్క రాష్యాకే కాకుండా దాదాపు 30 దేశాలను కుదిపేసింది. అయితే ఇప్పటి వరకు ఈ స్థాయిలో ప్రపంచాన్ని కుదిపేసిన భూకంపాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

1 / 5
ప్రపంచంలో ఇప్పటివరకు సంభవించిన భూకంపాల్లో అత్యంత శక్తివంతమైనది గ్రేట్ చిలీ భూకంపం. ఇది 1960లో దక్షిణ అమెరికా దేశమైన చిలీలో ఏర్పడింది. అప్పుడు రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్ర 9.5గా నమోదైంది. ఈ భూకంపం ప్రంచాన్ని అతలాకుతలం చేసేసింది. దీని ప్రభావంతో 1,655 ప్రాణాలు కోల్పోగా, లక్షల మంది నిరాశ్రయులయ్యారు. లక్షల కొద్ది భవనాలు నేలమట్టమయ్యాయి.

2 / 5
గ్రేట్‌చిలీ భూకంపం తర్వాత సంభవించిన మరో అతిపెద్ద భూకంపం గుడ్‌ఫ్రైడే భూకంపం. ఇది 1964లో అమెరికా రాష్ట్రమైన అలస్కాలో ఏర్పడింది. అప్పుడు రిక్టరు స్కేలుపై భూకంప తీవ్రత 9.2గా నమోదైంది. ఈ భూప్రకంపనల ధాటికి ఏర్పడిన సునామీ అలస్కా నగరాన్ని ముంచెత్తింది. ఈ భూంకం ధాటికి  సుమారు 130 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

3 / 5
గుడ్‌ఫ్రైడే భూకంపం తర్వాత సంభవించిన మరో పెద్ద భూకంపం 2004లో ఇండొనేషియాలోని సుమత్రా దీవుల్లోసంభవించింది. అప్పుడు రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 9.1 నమోదైంది. ఈ భూకంపం సుమారు మూడు దేశాలను కుదిపేసింది. ఈ భూకంపం ధాటికి మూడు దేశాల వ్యాప్తంగా సుమారు 2,80,000 మందికిపైగా జనాలు ప్రాణాలు కోల్పోయారు.

4 / 5
2004 తర్వాత 2011లో జపాన్‌లో సంభవించిన గ్రేట్‌ తోహోక్‌ అనే మరో భారీ భూకంపం ప్రపంచాన్ని వణికించింది. అప్పుడు రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 9.1గా నమోదైంది. ఈ భూకంపం ధాటికి సుమారు 15 వేల మంది దాకా జనాలు ప్రాణాలు కోల్పోయారు.

5 / 5
ఇక ప్రపంచంలోనే తొలిసారి రష్యాలో అత్యంత శక్తవంతమైన భూకంపం సంభవించింది. ఇది 1952లో కమ్చట్కా క్రై ప్రాంతంలో ఏర్పడింది. అప్పుడు రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్ర 9గా నమోదైంది. ఈ భూకంపం ధాటికి ఎలాంటి భారీగా అస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది.