Kitchen Hacks: గ్యాస్ బర్నర్ పై జిడ్డు పేరుకుందా .. శుభ్రం చేయడానికి సింపుల్ చిట్కాలను పాటించి చూడండి..

|

Apr 03, 2024 | 9:42 AM

గ్యాస్ స్టవ్ మీద ఎక్కువగా వంట చేస్తే దానిలో కార్బన్ చేరుతుంది. అంతేకాదు వంట చేస్తున్న సమయంలో కొన్ని సార్లు పాలు మరిగిస్తున్నా అన్నం వండుతున్నా పొంగి గ్యాస్ బర్నర్ రంధ్రాల్లోకి చేరుకుంటుంది. దీంతో వంట చేసిన తర్వాత గ్యాస్ బర్నర్ జిడ్డుగా మారుతుంది. అప్పుడు బ్లూ కలర్ మంటకు బదులుగా పసుపు లేదా నలుపు మంట రావడం మొదలువుతుంది. వెంటనే గ్యాస్ బర్నర్‌ను శుభ్రం చేయాలి. లేదంటే ఆహారం వండే సమయంలో గ్యాస్ వృధా అవుతుంది. ఆహారం ఉడకడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో గ్యాస్ బర్నర్ ను శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఈ సింపుల్ టిప్స్ తో గ్యాస్ బర్నర్ ను శుభ్రం చేస్తే గాజులా తళతళా మెరుస్తుంది. 

1 / 7
రోజుల తరబడి గ్యాస్ స్టవ్ మీద వంట చేస్తున్నప్పుడు గ్యాస్ బర్నర్ జిడ్డుగా మారుతుంది. దీంతో వంట చేయడం కష్టంగా మారుతుంది. అంతేకాదు గిన్నెలు కూడా జిడ్డుకారుతూ శుభ్రం చేయడానికి కష్టతరం అవుతాయి. కనుక గ్యాస్ బర్నర్ ను గాజులా తళతళా మెరిసే విధంగా సింపుల్ టిప్స్ మీ కోసం.. వాటితో గ్యాస్ బర్నర్ జిడ్డును సులభంగా తొలగించవచ్చు.

2 / 7
వంట పూర్తి చేసిన వెంటనే ముందుగా గ్యాస్ ఓవెన్ నుంచి గ్యాస్ బర్నర్‌ను తీసివేసి చల్లబరచండి. బర్నర్ వేడిగా ఉన్నప్పుడు బర్నర్ ను శుభ్రం చేసే ప్రయత్నం చేయవద్దు.   

3 / 7
ఇప్పుడు బర్నర్ ను శుభ్రం చేయడానికి ఒక పెద్ద గిన్నెలో వేడి నీటిని తీసుకొని బేకింగ్ సోడా, వెనిగర్ జోడించండి.

4 / 7
గ్యాస్ బర్నర్ మునిగిపోయేలా మిశ్రమాన్ని తగినంతగా చేయండి. ఈ మిశ్రమంలో గ్యాస్ బర్నర్‌ను సుమారు 30-60 నిమిషాలు నానబెట్టండి.

5 / 7
మురికి ఎక్కువగా ఉంటే బర్నర్ ను కాసేపు నానబెట్టవచ్చు. తర్వాత, మృదువైన స్పాంజ్ లేదా బ్రష్‌ని ఉపయోగించి గ్యాస్ బర్నర్‌ను పూర్తిగా స్క్రబ్ చేయడం ప్రారంభించండి.

6 / 7
బర్నర్ పై పేరుకున్న జిడ్డు, మురికిని సులభంగా తొలగించవచ్చు. చివరగా గ్యాస్ బర్నర్‌ను శుభ్రమైన నీటితో కడగాలి. పొడి గుడ్డతో తుడవండి.

7 / 7
అప్పటికీ బర్నర్ గాజులా తళతళా మెరిసిపోలేదని అనిపిస్తే నిమ్మకాయ ముక్కతో బాగా రుద్దండి. అప్పుడు గ్యాస్ బర్నర్ కొత్తదిలా ఉంటుంది. 