
మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి.. ఈ ప్రత్యేక అవయవాలు శరీరంలోని మురికిని తొలగించడానికి పనిచేస్తాయి.. అటువంటి పరిస్థితిలో, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. తరచుగా కిడ్నీ ఆరోగ్యం పట్ల ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటారు.దీని వల్ల కిడ్నీలో మురికి పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో కిడ్నీల్లో రాళ్ళు వచ్చే ప్రమాదం ఉంటుంది. కిడ్నీలో టాక్సిన్స్ పేరుకుపోవడం ప్రారంభించిన వెంటనే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. తద్వారా కిడ్నీల్లోని మురికిని సులభంగా తొలగించుకోవచ్చు.

మీరు మీ కిడ్నీలను డిటాక్స్ చేయాలనుకుంటే కొన్ని జ్యూస్ లను తాగొచ్చు.. వీటితో మీ కిడ్నీలను శుభ్రంచేసుకోవచ్చు.. కిడ్నీలను డిటాక్స్ చేయడానికి ఇలా చేయండి..

బీట్ రూట్ జ్యూస్: బీట్‌రూట్, నిమ్మరసం, చిన్న అల్లం ముక్కలను కలపండి. వీటని జ్యూస్ గా తయారు చేసుకోండి.. తర్వాత ఈ జ్యూస్‌ని ఉదయాన్నే వడగట్టి తాగడం వల్ల కిడ్నీలోని మురికి తొలగిపోతుంది.

పుచ్చకాయ, కర్బూజ రసం: పుచ్చకాయ, క్యారెట్, దోసకాయల రసాన్ని అల్పాహారంగా త్రాగాలి. కిడ్నీలోని మురికిని బయటకు పంపడంలో ఈ జ్యూస్ చాలా సహాయపడుతుంది.

ఆరెంజ్ జ్యూస్: మీరు కిడ్నీలను శుభ్రం చేయాలనుకుంటే ఆరెంజ్ జ్యూస్ తయారు చేసి తాగండి. విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ కలిగిన ఈ పండు చాలా మేలు చేస్తుంది. దీన్ని తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం ఆగిపోతుంది.

మీరు మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే, మీ రోజువారీ ఆహారంలో ఈ రసాలను కూడా చేర్చుకోవడం మంచిది. మీకు కిడ్నీ సమస్యలు ఉంటే, మీ ఆహారంలో ఎర్ర ద్రాక్షను చేర్చుకోండి.సాయంత్రం అల్పాహారంగా కొన్ని ఎర్ర ద్రాక్షలను తినడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఇందులో ఉండే రెస్వెరాట్రాల్ సమ్మేళనం కిడ్నీ వాపు మరియు చికాకును తగ్గిస్తుంది.

క్యాల్షియం అధికంగా ఉండే ఆహారం అవసరం.. కిడ్నీ సమస్యలు ఉంటే క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తినకూడదని చాలా మంది భావిస్తారు. కానీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు అవసరం. కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు మూత్రపిండాల ఆరోగ్యానికి మంచివిగా పరిగణిస్తారు. కిడ్నీ ఆరోగ్యానికి సోయా, బాదం పాలు, టోఫు, బలవర్థకమైన తృణధాన్యాలు తప్పకుండా తినండి.