కేరళ కొబ్బరి కోటను కొల్లగొట్టిన రాష్ట్రం ఏదో తెలుసా..? వీకెండ్ వ్యవసాయంతో హవా…

Updated on: May 18, 2026 | 6:33 PM

కొబ్బరి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే రాష్ట్రం కేరళ. కానీ ఇప్పుడు సీన్ మారింది. దశాబ్దాల కాలంగా కొబ్బరి రాజధానిగా వెలిగిపోయిన కేరళను వెనక్కి నెట్టి, ఆ కిరీటాన్ని పొరుగు రాష్ట్రం కర్ణాటక సొంతం చేసుకుంది. కొబ్బరి అభివృద్ధి మండలి విడుదల చేసిన గణాంకాలు దేశంలోనే ఒక సరికొత్త రికార్డును నమోదు చేశాయి. అసలు కేరళ తన పీఠాన్ని ఎందుకు కోల్పోయింది? కర్ణాటక నంబర్ వన్ ఎలా అయింది? అనేది తెలుసుకుందాం..

1 / 5
ఒకప్పుడు కొబ్బరి సాగుకు పర్యాయపదంగా కొబ్బరి రాజధానిగా కేరళ ప్రసిద్ధి చెందింది. కేరళ పేరులోనే కేర (కొబ్బరి చెట్టు) దాగి ఉంది. కానీ కాలక్రమేణా పరిస్థితులు మారిపోయాయి. తాజా గణాంకాల ప్రకారం.. కేరళ తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. కొబ్బరి అభివృద్ధి మండలి నివేదికల ప్రకారం.. ఇప్పుడు దేశంలో అత్యధికంగా కొబ్బరిని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా కర్ణాటక రికార్డు సృష్టించింది.

2 / 5
2023-24 గణాంకాల ప్రకారం.. కర్ణాటక 6.15 బిలియన్ల కొబ్బరికాయల ఉత్పత్తితో ప్రథమ స్థానంలో నిలవగా, 6.09 బిలియన్లతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. కేరళ 5.52 బిలియన్లతో మూడవ స్థానానికి పడిపోయింది. కర్ణాటక ఈ అద్భుతమైన వృద్ధిని సాధించడం వెనుక వినూత్నమైన మార్పులు ఉన్నాయి. ముఖ్యంగా వీకెండ్ ఫార్మింగ్ అనే ధోరణి అక్కడ పెరిగింది.

3 / 5
కర్నాటకలోని తుమకూరు, హాసన్, మాండ్య వంటి జిల్లాల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ఇతర వృత్తి నిపుణులు వీకెండ్స్‌లో కొబ్బరి సాగుపై దృష్టి పెడుతున్నారు. దీనికి తోడు, తీరప్రాంత జిల్లాలైన మంగళూరు, ఉడుపిలలో ఉండే తేమతో కూడిన వాతావరణం, నైరుతి రుతుపవనాల వల్ల లభించే సమృద్ధిగా వర్షపాతం కొబ్బరి తోటలకు ప్రాణం పోస్తున్నాయి. దీంతో అక్కడ కొబ్బరి ఉత్పత్తి బాగా పెరిగింది.

4 / 5
నేల స్వభావం కూడా కర్ణాటకకు కలిసి వచ్చిన మరో ముఖ్య అంశం. ఇక్కడి ఎర్ర బంకమట్టి, తీరప్రాంత నేలల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రవహించే గుణం ఉంటుంది, ఇది కొబ్బరి వేర్లకు చాలా మేలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, కొబ్బరి అభివృద్ధి మండలి సంయుక్తంగా రైతులకు మెరుగైన విత్తనాలు, ఆధునిక నీటిపారుదల పద్ధతులపై శిక్షణ ఇవ్వడం, రాయితీలు కల్పించడం వల్ల దిగుబడితో పాటు నాణ్యత కూడా పెరిగింది. కేవలం సాంప్రదాయ పద్ధతులే కాకుండా, శాస్త్రీయంగా తెగుళ్ల నివారణను చేపట్టడం కర్ణాటకను అగ్రస్థానంలో నిలబెట్టింది.

5 / 5
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, కొబ్బరి ఉత్పత్తిలో భారత్ ఒక తిరుగులేని శక్తిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా పండే కొబ్బరిలో 30 శాతానికి పైగా వాటా మన దేశానిదే. ఏటా సుమారు 21.37 బిలియన్ల కొబ్బరికాయలను ఉత్పత్తి చేస్తున్న భారత్.. వియత్నాం, యూఏఈ, బంగ్లాదేశ్ వంటి దేశాలకు భారీగా ఎగుమతి చేస్తుంది. అమెరికా, మలేషియా మార్కెట్లలో కూడా భారతీయ కొబ్బరికాయలకు మంచి డిమాండ్ ఉంది. నేడు దేశవ్యాప్తంగా దాదాపు కోటి మంది రైతులు ఈ సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు.

Follow Us