
ఇది వరకు రోజుల్లో బెల్లంను ఎక్కువగా తీసుకుని తినేవాళ్లు. ఇంట్లో ఏదొక పని చేస్తూ బెల్లం కనిపిస్తే వెంటనే ఒక ముక్క తీసుకుని నోట్లో తినేవాళ్లు. దీనిలో ఐరన్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు హాస్పిటల్స్ చుట్టూ తిరగకుండా ఈ ఒక్కటి మీ ఫుడ్ డైట్ లో చేర్చుకుంటే చాలు.

దీనిలో మనకి కావాల్సిన పొటాషియం, ఐరన్, కాల్షియం వంటివి విలువైన ఖనిజాలు ఉంటాయి. రక్తం తగ్గితే మనిషి వెంటనే నీరసం పడిపోతాడు, ఇలాంటి వాళ్లు బయట మందులు మీద వాడటం మానేసి ఇది ఒక్క ముక్క తింటే చాలు. దీనిని ఎలా తీసుకుంటే మీ శరీరంలో రక్తం పడుతుందో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

ఇది తింటే శరీరంలో శక్తి కూడా పెరుగుతుంది. అంతే కాదు, రక్తహీనత సమస్యకు చెక్ పెట్టి ఇది రక్తాన్ని పెంచుతుంది. అందుకే, ఇప్పటికి ఎంతో మంది తింటూనే ఉంటున్నారు. అంతేకాదు దీనిని సాంప్రదాయ ఆహారంగా చెబుతారు. దీనిని అసలు తినని వాళ్ళు ఇప్పటి నుంచి తింటూ ఉండండి. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది

ఇది మీ ఫుడ్ లో చేర్చుకుంటే అలసట, నీరసాన్ని కూడా తగ్గిస్తుంది. ఖరీదైన మెడిసిన్స్ కు పెట్టె కంటే మీ ఇంట్లోకి కేజీ బెల్లం కొనుక్కుని రోజూ ఒక ముక్క తింటూ ఉండండి. ఈ బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.ఇంటి పనుల్లో చేసేటప్పుడు ఒక చిన్న ముక్క తిన్నా చాలు .. శరీరంలో దాని పని అదే చేసుకుంటుంది.

(నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)