
చాలా మందికి ఇప్పుడు యుక్త వయసులో ఉన్నప్పుడే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. చిన్న పిల్లల్లో కూడా ఈ తెల్ల జుట్టు అనేది కనిపిస్తుంది. దీని వల్ల చాలా మంది తమ ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతున్నారు. నలుగురిలో వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ తెల్ల జుట్టును కవర్ చేసుకోవడానికి హెయిర్ కి రంగులు వేసుకుంటూ ఉంటారు. కానీ వీటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి.

దానికి తోడు ఇప్పుడు తినే ఆహారంలో కూడా సరైన పోషకాలు ఉండటం లేదు. వీటి వల్ల జుట్టు కూడా బలహీనంగా మారి.. రాలడం, తెల్ల బడటం జరుగుతుంది. హెయిర్ ఫాట్ ను తగ్గించు కోవడానికి, నల్లగా మార్చుకోవడానికి మందులు వాడే బదులు.. కొన్ని నేచురల్ టిప్స్ ని ఫాలో అయితే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దానితో పాటు మీ జుట్టు నేచురల్ గా నల్లగా, హెల్దీగా ఉంటుంది.

హెయిర్ ని నల్లగా మార్చడంలో మన ఇంట్లో బెల్లం, మెంతులు బాగా ఎఫెక్టీవ్ గా పని చేస్తాయి. ఒక స్పూన్ మెంతుల పొడిని బెల్లంతో పాటు కలిపి.. ఉదయం పరగడుపున తింటే.. తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతే కాకుండా జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.

అంతే కాకుండా జుట్టు రాలి పోవడానికి, తెల్లబడటానికి చాలా కారణాలు ఉన్నాయి. థైరాయిడ్, శరీంలో విటమిన్ బి-12 లేకపోవడం, ధూమ పానం, ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, జన్యు సంక్రమణ, ధూమ పానం ఇలాంటి కారణాల వల్ల జుట్టు పై తీవ్ర ప్రభావం పడుతుంది.

అంతే కాకుండా సరైన ఆహారం తీసుకోక పోవడం వల్ల కూడా జుట్టు బలహీనంగా మారుతుంది. కాబట్టి ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలి. నోటికి రుచి అయినవే కాకుండా.. శరీరానికి కూడా అవసరం అయ్యే ఆహారం తీసుకోవడ చాలా ఇంపార్టెంట్.