Zanetti Train Mystery: ఘోస్ట్‌ ట్రైన్‌ మిస్టరీ మీకు తెలుసా? 106 మంది ప్రయాణికులతో అదృశ్యమైన ట్రైన్‌.. ఒక్క క్లూ కూడా దొరకలేదు!

|

Oct 02, 2022 | 11:31 AM

విమానాలు, హెలికాఫ్టర్లు, కార్లు, బస్సులు.. ఒక్కోసారి దారితప్పో, మరేదైనా కారణంతో కనుమరుగవుతుంటాయి. ఐతే రైలు కనిపించకుండా పోవడం ఎప్పుడైనా జరిగిందా? అంత పెద్ద రైలును ఎలా దాచేస్తారనేగా మీ సందేహం? 1911లో అటువంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఇప్పటివరకు ఒక్క క్టూ కూడా..

1 / 5
విమానాలు, హెలికాఫ్టర్లు, కార్లు, బస్సులు.. ఒక్కోసారి దారితప్పో, మరేదైనా కారణంతో కనుమరుగవుతుంటాయి. ఐతే రైలు కనిపించకుండా పోవడం ఎప్పుడైనా జరిగిందా? అంత పెద్ద రైలును ఎలా దాచేస్తారనేగా మీ సందేహం? 1911లో అటువంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. సొరంగంలోకి ప్రవేశించిన రైలు మిస్టీరియస్‌గా అదృశ్యమైంది. అప్పుడు కనిపించకుండా పోయిన రైలు జాడ ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియలేదు. కనీసం దానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఈ రైలు ఎక్కడికి వెళ్లింది? ఎలా మాయమైంది? ఈ ప్రశ్నలన్నీ ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఇది ప్రపంచంలోని అతిపెద్ద మిస్టరీలలో ఒకటి.

2 / 5
ఈ వింత ఘటన ఇటలీ రాజధాని రోమ్‌లో చోటుచేసుకుంది. నిజానికి, 1911వ సంవత్సరంలో జెనెటీ అనే రైలు రోమన్ స్టేషన్ నుంచి బయలుదేరింది. తదుపరి స్టేషన్‌కు వెళ్లే మార్గంలో ఓ టన్నెల్‌ ఉంటుంది. ఐతే ఆశ్చర్యకరంగా దానిలోకి వెళ్లిన ట్రైన్‌ శాశ్వతంగా అదృశ్యమైంది.

3 / 5
ట్రైన్‌ టన్నెల్‌లోకి ప్రవేశించే ముందు దాని నుంచి పొగ రావడం గమనించిన ఇద్దరు వ్యక్తులు భయంతో బయటికి దూకేశారు. ఆ తర్వాత అది నేరుగా టన్నెల్‌లోనికి వెళ్లి తిరిగి రాకపోవడాన్ని వారు గమనించినట్లు తెలిపారు.

4 / 5
అదృశ్యమైన ఈ ట్రైన్‌లో 100 మంది ప్రయాణికులతోపాటు, ఆరుగురు రైల్వే సిబ్బంది కూడా ఉన్నారు. ఈ సంఘటన జరిగి సరిగ్గా 112 ఏళ్లు దాటింది. ఆ తర్వాత ట్రైన్‌ అదృశ్యమైన టన్నెల్‌ను పూర్తిగా మూసివేశారు. కొంతమంది ఈ ట్రైన్‌ను 'ఘోస్ట్‌లీ ట్రైన్' అని కూడా పిలుస్తారు.

5 / 5
మెక్సికోకు చెందిన ఓ వైద్యుడు కనిపించకుండా పోయిన ఈ రైలుకు సంబంధించి ఓ వింత విషయాన్ని తెలిపాడు. అదేంటంటే.. ఏకంగా 104 మంది రైలు ప్రయాణికులను తన ఆసుపత్రిలో చేర్చారని, అయితే వారందరికీ పిచ్చి పట్టిందని అన్నారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. వారంతా రైలులో ఆసుపత్రికి చేరుకున్నారట.