అతిగా వీడియో గేమ్స్ ఆడుతున్నారా.? మీరు పిచ్చోళ్లు కావడం ఖాయం..

Edited By: Ravi Kiran

Updated on: Feb 12, 2024 | 6:29 PM

స్మార్ట్ ఫోన్, ఫ్రీ ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడంతో పిల్లలు, యూత్ అంతా సోషల్ మీడియాతో పాటు వీడియో గేమ్స్‌పై ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. కొందరికి వర్క్ ఫ్రం హోం అయితే..

1 / 5
స్మార్ట్ ఫోన్, ఫ్రీ ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడంతో పిల్లలు, యూత్ అంతా సోషల్ మీడియాతో పాటు వీడియో గేమ్స్‌పై ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. కొందరికి వర్క్ ఫ్రం హోం అయితే.. పిల్లలకి మాత్రం డిజిటల్ క్లాసులతో ల్యాప్‌టాప్స్, ఫోన్స్ అమాంతం వాళ్ల చేతుల్లోకి వచ్చేశాయి. దీంతో ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో స్మార్ట్ ఫోన్లతో గడిపేస్తున్నారు. చదువుకోవడానికి.. వర్క్ చేసుకోవడానికి.. ల్యాప్‌ట్యాప్, మొబైళ్లు యూజ్ చేస్తున్నప్పటికీ ఆ తర్వాత ఎక్కువ సమయం వీడియో గేమ్స్, సోషల్ మీడియాలో గడపడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

2 / 5
ఇలా ఎక్కువ సమయం ఇంటర్నెట్‌లో గేమ్స్ ఆడడం వల్ల చాలామంది మెంటల్ డిజార్డర్‌కి గురవుతున్నారని.. దీనివల్ల మానసిక రుగ్మతలు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇలా ఎక్కువ సమయం వీడియో గేమ్స్, ఇంటర్నెట్ గేమ్స్ ఆడుతున్న పిల్లలు, యువత స్వయంగా వారిపై వారు నియంత్రణ కోల్పోయి చెడు అలవాట్లకు లోనవుతున్నారని దీనిని గేమింగ్ అడిక్షన్ లేదా గేమింగ్ డిజార్డర్ అని అంటారని డబ్ల్యూహెచ్‌ఓలోని ఒక విభాగమైన ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ తెలిపింది.

3 / 5
ఈ గేమింగ్ అడిక్షన్‌కి లోనైన వారు చెడు అలవాట్లు నేర్చుకోవడంతో పాటు తమ చదువులను, ఉద్యోగాలను వదిలేసి ఎక్కువ టైం.. స్క్రీన్ స్క్రీన్‌పై ఫోకస్ చేయడం జరుగుతుందని.. దీని వల్ల మెంటల్‌గా డిస్టర్బ్ అవడంతో పాటు శారీరకంగానూ వీక్ అవుతారని.. దీని వల్ల వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సామాజికపరంగా, చదువు, ఉద్యోగం ఇవన్నింటిని నిర్లక్ష్యం చేస్తున్నారని సర్వేలో వెల్లడైంది. వీటితో పాటు ఎక్కువ సమయం గేమ్స్ ఆడేవారిలో చికాకు పెరగడం, ఇతరులకు దూరంగా ఉండడం, వ్యక్తిగత శుభ్రతకు దూరంగా ఉండడం, ఇవన్నీ కూడా గేమింగ్ డిజార్డర్‌లో లక్షణాలని అంటున్నారు.

4 / 5
ఈ లక్షణాలు ఉన్నవాళ్లు రోజుకి దాదాపు 7, 8 గంటల వరకు వీడియో గేమ్స్‌పై టైం స్పెండ్ చేస్తారని.. ఇలా స్క్రీన్‌కి అతుక్కుపోయి ఉండేవారిలో.. క్షణికావేశం, నిరాశ, ఆందోళన, ఒంటరితనం, మాటల్లో చురుకుదనం కోల్పోవడం, ఆకలి లేకపోవడం, నిద్ర లేకపోవడంతో, కంటిపై ప్రభావం చూపడం, వెన్నునొప్పి, మెడ నొప్పి, చేసే పనిలో ఏకాగ్రత లేకపోవడం, విచిత్ర ప్రవర్తనలు ఉండటం ఇలాంటి అనారోగ్య లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని.. ఈ లక్షణాలు కనిపించిన వారిని వెంటనే వైద్యులను సంప్రదిస్తే బెటరని అంటున్నారు.

5 / 5
ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్‌లను కట్టడి చేయాలి అంటే లక్షణాలు కనిపించిన వారికి వెంటనే స్సికోథెరపి ఇవ్వాలని.. అలాగే ఈ డిజార్డర్ బారిన  పడినవారిని మానసిక వైద్యుల పర్యవేక్షణలో కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, గ్రూప్ థెరపీ, ఫార్మిలా కౌన్సిలింగ్ లాంటి చికిత్సలతో చికిత్స అందించవచ్చునని వైద్యులు అంటున్నారు. ఈ చికిత్సలతో పాటు డిజార్దర్ బారినపడిన వారి జీవనశైలిలో మార్పులు తీసుకురావడం, క్లీనింగ్ టైం తగ్గించడం లాంటి చర్యలు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.