Ghee Purity: మీ నెయ్యి స్వచ్ఛమైనదేనా..? అవునో, కాదో సులభంగా తెలుసుకోండిలా..

|

Mar 24, 2023 | 9:12 PM

నెయ్యి రుచిని ఇష్టపడనివారు ఎవరుంటారు..? తినే ఆహారం ఏదైనా దానికి రుచిని పెంచడంలో నెయ్యి ప్రధాన  పాత్ర పోషిస్తుంది. అయితే మన వంటలలో ఉపయోగించే నెయ్యి స్వచ్చమైనదా కాదా అనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా..? స్వచ్ఛమైన నెయ్యి, కల్తీ నెయ్యి అని తెలుసుకోవడం ఎలా..? ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

1 / 5
అసలైన నెయ్యిని గుర్తించేందుకు అందులో నాలుగు లేదా ఐదు చుక్కలు అయోడిన్ వేయండి. అది నీలి రంగులోకి మారితే నకిలీదని అర్థం. నెయ్యిలో ఆలుగడ్డ వంటి పిండి పదార్థాలు కలపడం వలన ఈ రంగు వస్తుంది.

2 / 5
కల్తీ నెయ్యిని పసిగట్టేందుకు ఒక స్పూన్ నెయ్యిలో కొంచెం చక్కెర వేయండి. దానికి హైడ్రాక్లోరిక్ ఆమ్లాన్ని కొద్దిగా కలపండి. అది ఎరుపు రంగులోకి మారితే కల్తీ చేశారని గ్రహించాలి.

3 / 5
నెయ్యి నాణ్యత సింపుల్ గా ఎలా గుర్తించేందుకు ఇంకో చక్కటి చిట్కా ఉంది. చేతిలో కాస్త నెయ్యి వేసి, రెండు చేతులతో బాగా రుద్దాలి. కాసేపు అయ్యాక నెయ్యి వాసన రాదు. నాణ్యమైన నెయ్యి ఎప్పుడు సువాసనతో ఉంటుంది. ఇలా రుద్దిన వెంటనే వాసన పోదు. వాసన పోయిందంటే అది కల్తి నెయ్యి.

4 / 5
నాణ్యమైన నెయ్యి తెల్లగా గడ్డ కట్టినట్లుగా ఉంటుంది. పూస పూసల కనిపిస్తుంది. వేడి చేసినప్పుడు మాత్రమే నూనెలా కనిపిస్తుంది. అదే కల్తీ నెయ్యికి ఇలా ఉండదు. ఏ మాత్రం చిక్కగా లేకున్నా కల్తీ అయినట్లుగా అనుమానించవచ్చు.

5 / 5
మార్కెట్లో దొరికే నెయ్యిలో కొందరు రసాయనాలు కలుపుతున్నారు. ఇది ఆరోగ్యానికి హానికరం. అందుకే అలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ చిట్కాలు పాటించి, అసలైన నెయ్యిని గుర్తించండి. దాన్నే వాడండి.