
ప్రెగ్నెన్సీ సమయంలో జాగ్రత్త ఉండాలన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కడుపులో ఉన్న బిడ్డ, తల్లి ఇద్దరూ సురక్షితంగా ఉండటానికి జీవనశైలి, ఆహారంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. కొంతమంది గర్భణీగా ఉన్న సమయంలో ఇష్టమన్న కారణంతో టీ తెగ తాగేస్తుంటారు.

రోజుకు 2 నుంచి 3 సార్లు టీ అవసరం. కానీ గర్భధారణ సమయంలో టీని పరిమిత పరిమాణంలో తాగాలి. టీ, కాఫీ రెండింటిలోనూ కెఫిన్ ఉంటుంది. కాబట్టి గర్భధారణ సమయంలో వాటిని పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలని గైనకాలజిస్ట్‌లు చెబుతున్నారు.

గర్భిణీలు రోజుకు 200 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ టీ తాగకూడదని హెచ్చరిస్తున్నారు. రోజుకు రెండు కప్పుల టీ కూడా తాగకూడదని నిపుణులు అంటున్నారు. అందుకే గర్భధారణ సమయంలో కెఫిన్‌ను మితంగా తీసుకోవడం మంచిది.

టీ అధికంగా తీసుకుంటే కడుపులో బిడ్డ పెరుగుదల మందగించడం, నెలలు నిండకముందే ప్రసవం, గర్భస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రతి ఒక్కరి వైద్య పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అందుకే గర్భధారణ సమయంలో టీ అస్సలు తాగకూడదని సలహా ఇస్తున్నారు.

గర్భధారణ సమయంలో రోజుకు ఎన్ని కప్పుల టీ సముచితమో తెలుసుకోవడానికి ముందుగా మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది. టీ ఎక్కువగా తీసుకుంటే గర్భిణీలకు నిద్రలేమి సమస్య తలెత్తే అవకాశం ఉంది.