5 / 5
షాంపూతో తలస్నానం చేసినా జుట్టుకు సహజమైన మెరుపు రావడం లేదని చాలా మంది చెబుతుంటారు. అయితే షాంపూ చేయడానికి ముందు నూనె రాసుకోవడం వల్ల ఈ సమస్య కనిపించదు. బదులుగా, జుట్టును చాలా మృదువుగా, మెరిసేలా చేస్తుంది. షాంపూ చేయడానికి 30 నిమిషాల ముందు నూనెను వేడి చేసుకోవాలి. గోరువెచ్చగా మారిన తర్వాత నూనెతో మసాజ్ చేసుకుని, 30 నిమిషాల తర్వాత తల స్నానం చేసుకోవాలి.