
కొంతమందికి ఉదయం కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు మంచిదా చెడ్డదా? దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకోవాలి. ఎందుకంటే ఖాళీ కడుపుతో కెఫిన్ తీసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Black Coffee

Black coffee

గ్యాస్ట్రిటిస్, అల్సర్లు లేదా యాసిడ్ రిఫ్లక్స్ వంటి జీర్ణ సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగకూడదు. గర్భిణీ స్త్రీలు లేదా పాలిచ్చే తల్లులు ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం కూడా మంచిది కాదు.

ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం వల్ల వణుకు, హృదయ స్పందన రేటు పెరగడం, తలనొప్పి కూడా వస్తాయి. బ్లాక్ కాఫీ నిద్రను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా పడుకునే ముందు బ్లాక్ కాఫీ తాగవద్దు. అలాగే ఎవరైనా తీవ్ర ఒత్తిడితో బాధపడుతుంటే బ్లాక్ కాఫీ తాగడం మానేయడం మంచిది. ఇది మీ ఆరోగ్య పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు.