కొందరు చికెన్‌ను స్కిన్‌తో పాటు వండుకొని తింటారు. మరికొందరు స్కిన్ లెస్ తింటారు. చికెన్ స్కిన్‌లో ఎక్కువ కొవ్వు ఉంటుందని దీన్ని పక్కన పెడతారు.
నిజానికి చికెన్ స్కిన్‌లో 32 శాతం కొవ్వు ఉంటుంది. దీనిలో మూడింట రెండొంతులు మంచి కొవ్వు, మరో వంతు చెడు కొవ్వు ఉంటుంది.
మంచి కొవ్వు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపర్చడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఇంతకీ వాళ్లు చెప్పే సలహాలు, సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
ఒకవేళ చికెన్‌ను స్కిన్‌తో పాటు కలిపి తింటే దీనిలో ఉండే కొవ్వు వల్ల ఎక్కువ క్యాలరీలు అదనంగా శరీరంలోకి చేరతాయి. ఈ అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరకూడదనుకుంటే..
చికెన్ నుంచి స్కిన్‌ను వేరుచేసి తినడం మంచిదని సూచిస్తున్నారు. ఎలాంటి వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు.. వండేటప్పుడు చికెన్ స్కిన్‌ను అలాగే ఉంచి తినేముందు తీసేస్తే మంచిది.