
ఐఆర్‌సీటీసీ ఎప్పటికప్పుడు పర్యాటకుల కోసం టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తుంటుంది. ఇప్పుడు మరో ఐదు టూర్ ప్యాకేజీల గురించి చెప్పబోతున్నాము. వీటిని 5 వేల రూపాయల కంటే తక్కువ ధరతో బుక్ చేసుకోవచ్చు. మొదటి టూర్ ప్యాకేజీ ఏంటంటే.. ఇది మార్చి 31 నుంచి ప్రారంభమవుతుంది. ఈ టూర్ 4 రోజులు ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో షిర్డీ, త్రయంబకేశ్వర్ సందర్శించవచ్చు. మీరు ఈ పర్యటనను రూ.4200తో బుక్ చేసుకోవచ్చు.

వైష్ణో దేవి టూర్: వైష్ణో దేవికి వెళ్లే వారి కోసం ఐఆర్‌సీటీసీ అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందించింది. మీరు ఈ టూర్ ప్యాకేజీని రూ.3,515తో బుక్ చేసుకోవచ్చు. టూర్ ప్యాకేజీ మార్చి 31 నుంచి ప్రారంభమవుతుంది.

తిరుపతి టూర్: తిరుపతి బాలాజీని దర్శించుకునే భక్తులకు ఇంతకంటే మంచి టూర్ ప్యాకేజీ ఉండదు. మీరు ఈ టూర్ ప్యాకేజీని కేవలం రూ.3,800తో బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవుతుంది.

మధురే/బృందావన్ టూర్: ఐఆర్‌సీటీసీ ఈ టూర్ ప్యాకేజీలో మీరు శ్రీకృష్ణ జన్మభూమి అంటే మధుర, బృందావన్‌లను సందర్శిస్తారు. ఈ పర్యటన కూడా మార్చి 31న ప్రారంభమైంది. మీరు ఈ పర్యటనను కేవలం రూ.3300తో బుక్ చేసుకోవచ్చు.

వైజాగ్ టూర్: సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంను కేవలం రూ.4,730కే సందర్శించవచ్చు. ఈ పర్యటన మార్చి 31 నుంచి ప్రారంభమవుతుంది, దీనిలో మీరు రెండు రోజుల్లో బీచ్‌ను కూడా సందర్శించవచ్చు.